ప్రసాదరెడ్డిది కచ్చితంగా రాజకీయ హత్యే..

రాప్తాడు(అనంతపురం): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రసాద్ రెడ్డిది కచ్చితంగా రాజకీయ హత్యేనని  ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి అన్నారు. టీడీపీ నేతలు ఎమ్మార్వో కార్యాలయాన్ని ఆక్రమించుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ కార్యాలయాలు ఆపార్టీ నేతలకు అడ్డాగా మారాయని గుర్నాథరెడ్డి విమర్శించారు. కాగా రాప్తాడు ఎమ్మార్వో కార్యాలయంలో ప్రసాద్ రెడ్డిపై దుండగులు వేటకొడవళ్లతో దాడి చేసి పాశవికంగా హతమార్చిన విషయం తెలిసిందే.

సమాచారం అందుకున్న గుర్నాథరెడ్డి హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్రెడ్డి మృతదేహాన్ని చూసి ఆయన కంటతడి పెట్టారు.  గతంలో తనకు ప్రాణహాని ఉందని ప్రసాద్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని గుర్నాధరెడ్డి ఆరోపించారు.మరోవైపు ప్రసాద్రెడ్డి హత్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. వైఎస్ఆర్ సీపీ నేతలపై దాడులు, హత్యలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.
Back to Top