అన్న సీఎం అయితేనే బతుకులు బాగుపడతాయి

తూర్పుగోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే తమ కష్టాలు తీరుతాయని ప్రజలంతా విశ్వసిస్తున్నారని పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త పర్వతప్రసాద్‌ అన్నారు. వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. రైతులు, వృద్ధులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, వారి సమస్యలను జననేతకు చెప్పుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారన్నారు. ముఖ్యంగా ప్రత్తిపాడు నియోజకవర్గం వ్యవసాయంపై ఆధారపడిందని, రైతులు, రైతు కూలీలు అధికంగా ఉన్నారన్నారు. తెలుగుదేశం పాలనలో నష్టపోతున్న విధానాలను జననేతకు వివరిస్తున్నారన్నారు. కౌలురైతులను ఆదుకుంటామని వైయస్‌ జగన్‌ ఇచ్చిన హామీ ప్రజల్లో నూతన ఉత్తేజాన్ని నింపిందన్నారు. అదే విధంగా ప్రత్తిపాడులో నీరుచెట్టు, మరుగుదొడ్ల నిర్మాణంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతుందని ఆయన మండిపడ్డారు. 
 
Back to Top