హత్యా రాజకీయాలకు చంద్రబాబు ట్రేడ్‌మార్కు

ఆపరేషన్‌ గరుడ చంద్రబాబు పథకమే..
లోకేష్‌ కోసం వైయస్‌ జగన్‌ను మట్టుబెట్టాలనుకున్నాడు
టీడీపీని కీలుబొమ్మగా వాడుకుంటూ అరాచకాలు
ఎన్టీఆర్‌ బతికుంటే ఆత్మహత్య చేసుకునేవారు
మనిషి జాతిలో చంద్రబాబులాంటి నీచుడిని చూడలేదు
ప్లాన్‌ బెడిసికొట్టిందని ఢిల్లీకి వెళ్లారా చంద్రబాబూ
చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాలు
హైదరాబాద్‌: వెన్నుపోటు, హత్యారాజకీయాలు, అవినీతి, అన్యాయాలకు చంద్రబాబు ట్రేడ్‌ మార్కు అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. చంద్రబాబు ప్రత్యక్ష రాజకీయాలు చేయడం చేతకాదని, వెన్నుపోటు, అబద్ధాలు పుట్టుకతోనే నేర్చుకున్నాడన్నారు. చంద్రబాబు పక్కా స్కెచ్‌తోనే ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగిందని ఆమె ధ్వజమెత్తారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని, అప్పుడు వైయస్‌ జగన్‌ సత్తా ఏంటో తెలుస్తుందని సవాలు విసిరారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో స్వర్గీయ ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ స్థాపించి అంతర్జాతీయస్థాయిలో పార్టీకి పేరు తీసుకువస్తే చంద్రబాబు చెట్టుపేరు చెప్పుకొని కాయలమ్ముకుంటున్నాడని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్‌ను తెలుగుదేశం పార్టీ నుంచి తొలగించి మానసిక క్షోభకు గురిచేశాడని మండిపడ్డారు. ఆయన మరణానికి కారణమైన చంద్రబాబు ఎన్టీఆర్‌ పేరు, పార్టీ పేరు చెప్పుకొని బతుకుతున్నాడన్నారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు మరిచి హత్యా రాజకీయాలు చేస్తూ ఎంతోమందిని పొట్టనబెట్టుకున్నాడన్నారు. 

చంద్రబాబు లాంటి దగుల్బాజీ రాజకీయాలు ఎవరూ చేయలేదని, వెన్నుపోటు హత్యా రాజకీయాలకు చంద్రబాబు ట్రేడ్‌ మార్కుగా తయారయ్యాడని నందమూరి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. వంగవీటి మోహనరంగా, పింగళి దశరథరామ్‌ హత్యతో చంద్రబాబుకు సంబంధాలు ఉన్నట్లు పత్రికలు కూడా చెప్పాయని గుర్తుచేశారు. టీడీపీని తన అరాచకాలకు కీలుబొమ్మగా వాడుకుంటున్నాడని, ఎన్టీఆర్‌ బతికి ఉంటే ఆత్మహత్య చేసుకునేవారన్నారు. 

లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలని చంద్రబాబు తెర వెనుక నుంచి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మట్టుబెట్టేందుకు పథక రచన చేశాడని లక్ష్మీపార్వతి అన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చంద్రబాబును అనేసార్లు కాపాడారని, ఆ విశ్వాసం కూడా లేకుండా కక్ష పెంచుకొని, ప్రజల కోసం ఒంటరి పోరాటం చేస్తున్న వైయస్‌ జగన్‌ను చంపాలని చూశాడని ధ్వజమెత్తారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం తగలబెట్టుకోవడానికా..? చంద్రబాబూ అని ప్రశ్నించారు. మనిషి జాతిలో ఇంత హీనమైన రాజకీయాలు చంద్రబాబుకు తప్ప ఎవరికీ రావన్నారు. ఏపీలో అవినీతి రాజ్యమేలుతుందని, పాలన అంతా అస్తవ్యస్థంగా మారిందని, పోలీస్‌ వ్యవస్థ ఉందో.. లేదో అర్థం కావడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 22 మంది వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు హత్య చేశారని, బాబును నమ్మి వచ్చిన అరకు ఎమ్మెల్యే కూడా మావోల చేతిలో హత్య చేయబడ్డాడని గుర్తు చేశారు. 

అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవడానికి, పాదయాత్రలో వైయస్‌ జగన్‌ వెంట తిరనాళ్లా జనం తరలివస్తున్నారని భరించలేక ఆపరేషన్‌ గరుడ అని స్కెచ్‌ వేసి మట్టుబెట్టాలనుకున్నారని, దీని వెనుక ఉంది చంద్రబాబేనని లక్ష్మీపార్వతి అన్నారు. ఎల్లోమీడియాను అడ్డం పెట్టుకొని చంద్రబాబు తనకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నాడని, కానీ సోషల్‌ మీడియా ద్వారా నిజాలన్నీ బయటకు వస్తున్నాయన్నారు. పెయిడ్‌ ఆర్టిస్టు శివాజీ అనే ఒక జోకర్‌ను అడ్డం పెట్టుకొని చంద్రబాబు అద్బుతమైన పాలన చేసి ఓర్వలేక ప్రతిపక్షాలు, కేంద్ర ప్రభుత్వం భయానక వాతావరణం సృష్టిస్తున్నాయని చెప్పించుకోవడం సిగ్గుచేటన్నారు. కొన్ని నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందని అన్ని సర్వేలు చెబుతున్నాయని, పదవి కాపాడుకోవడం కోసం ప్రతిపక్షనేతపై పకడ్బందీగా ఆపరేషన్‌ గరుడను చంద్రబాబు అమలు చేయిస్తున్నాడన్నారు. చంద్రబాబు పాలన దిగజారిపోయిందనేందుకు పోలీస్‌ వ్యవస్థ నిదర్శనమని, వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిన గంటలోపే డీజీపీ మీడియా ముందుకు వచ్చి పచ్చి అబద్ధాలు చెప్పారని, గంటలో లేఖలు సృష్టించారన్నారు.

ప్రతిపక్షనేతపై దాడి జరిగితే ఎందుకు ముఖ్యమంత్రి అసహనంగా ఉన్నారని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. ప్లాన్‌ బెడిసికొట్టిందని ఢిల్లీ వెళ్లాడా..? లేక రక్షణ కోసం వెళ్లాడా చెప్పాలన్నారు. స్టాంఫర్డ్‌ యూనివర్సిటీలో డిగ్రీ కొనుక్కొచ్చిన లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కుట్రలు చేస్తున్నాడన్నారు. ఎన్టీఆర్‌ భార్యనే తప్ప నారా కుటుంబంతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని, అల్లుడు అనే పిలిచే అర్హత కూడా కోల్పోయాడన్నారు. మిత్రుడి కుమారుడనే మానవత్వం కూడా లేకుండా హత్యాయత్నం చేయించడం దుర్మార్గమన్నారు. వెలగపూడి రామకృష్ణ, గంటా అనుచరుడు తెర వెనుక ఉన్నాడన్నారు. కేంద్రంపై తోసివేయాలని ఎయిర్‌పోర్టులో దాడి చేయించారని, పథకంలో భాగంగానే క్యాంటీన్‌లో నిందితుడు శ్రీనివాసరావును పెట్టించి, కత్తులు తెప్పించి దాడికి పాల్పడ్డారన్నారు. ఇప్పుడే ఇలా చేస్తే ఎన్నికల ముందు ఇంకా ఏ విధమైన దాడులు చేయిస్తారోనని భయంగా ఉందన్నారు. హత్యారాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతున్నారు. 
Back to Top