వైయస్‌ఆర్‌ ఆశయాలకు చంద్రబాబు తూట్లు...

శ్రీకాకుళంః అభివృద్ధికి నోచుకోక  రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లాగా శ్రీకాకుళం మిగిలిపోయిందని  వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. అభివృద్ధి చెందిన జిల్లాల సరసన నిలపాలని దివంగత మహానేత వైయస్‌ఆర్‌ ఎంతో చేయూతనిచ్చి,జిల్లాకు ఇతోధికంగా విద్య,ఇరిగేషన్‌ ప్రాజెక్టులు ఇచ్చారన్నారు. శ్రీకాకుళం జిల్లా రైతాంగానికి మండు వేసవిలో కూడా చల్లని నీరు అన్ని గ్రామాల్లో పారించాలని వంశధార ప్రాజెక్టును తీసుకువచ్చారన్నారు. వైయస్‌ఆర్‌ మరణం తర్వాత ఆయన ఆశయం నెరవేరలేదని,  ఆయన కలలు  సాకారమవ్వాలంటే  వైయస్‌ జగన్‌ను సీఎం చేయాల్సి అవసరం ఉందన్నారు. జిల్లా పట్ల  టీడీపీ వివక్ష చూపుతుందని,  వైయస్‌ఆర్‌ మరణంతో ప్రాజెక్టులు నిలిచిపోయాయన్నారు..వైయస్‌ఆర్‌ ఆశయాలకు చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నష్ట పరిహారంగా ఇచ్చిన 12 సంస్థలను శ్రీకాకుళంలో ఒకటి కూడా పెట్టలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం 2013లో చేసిన సెన్సెక్స్‌ అట్టడుగు,జీవనాప్రమాణా స్థాయి తక్కువ గల శ్రీకాకుళం జిల్లాకు ఇతోధికంగా నిధులు ఇవ్వాలని శ్రీకృష్ణ కమిషన్‌ తెలిపిందన్నారు. సుమారు రూ.లక్ష 18 వేల కోట్లు టీడీపీ అప్పులు చేసిందని, ఆ నిధుల్లో  శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి కొద్దీ మొత్తం కూడా ఖర్చు పెట్టలేదన్నారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన అప్పలను ఏంచేశారు అని ప్రశ్నించారు. కనీసం వంశధార ప్రాజెక్టు పూర్తిచేయలేదన్నారు. శ్రీకాకుళానికి అన్ని చేస్తానని చంద్రబాబు చెప్పారని,  కాని మీరు ఏం చేశారని ప్రశ్నించారు. ఈ నాలుగున్నర  సంవత్సరాలుగా ఒక నిర్మాణం కూడా చేపట్టలేదన్నారు. రూ. 20 కోట్లు పెడితే పూర్తయితే స్టేడియానికి మూడేళ్ల క్రితం «శంకుస్థాపన చేశారు..అదికూడా పూర్తి చేయలేదని దుయ్యబట్టారు.
 


Back to Top