వైయస్‌ జగన్‌ నాయకత్వంలోనే రాష్ట్రానికి మంచిరోజులు

విజయనగరంః గజపతి నియోజకవర్గంలో 7 రోజుల పాటు సాగిన ప్రజా సంకల్పయాత్రలో పెద్దసంఖ్యలో ప్రజలు తమ సమస్యలను జననేత వైయస్‌ జగన్‌కు చెప్పుకున్నారని గజపతి నియోజకవర్గం వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త బొత్స అప్పల నర్సయ్య తెలిపారు. వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వారి సమస్యలను తెలుసుకుని వారికి భరోసా ఇవ్వడం జరిగిందన్నారు.జననేత నాయకత్వంలో తమకు మేలు జరుగుతుందనే ఉద్దేశ్యంతో భారీ సంఖ్యలో  నియోజకవర్గ ప్రజలు జగన్‌కు బ్రహ్మరథం పట్టారన్నారు. టీడీపీ ప్రభుత్వం  సంక్షేమ కార్యక్రమాలు కేవలం  టీడీపీ నేతలు, కార్యకర్తలు జేబులు నింపడానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయని విమర్శించారు. వ్యక్తిగతంగా ప్రజలకు లబ్ధి చేకూరడంలేదన్నారు.మరుగుదొడ్లు, ఉపాధిహామీ, నీరు–చెట్టు పథకాల్లో కూడా అవినీతి జరుగుతుందన్నారు. పింఛన్లు,మట్టిని కూడా టీడీపీ నేతలు దోచుకుంటున్నారన్నారు..లంచం ఇవ్వనిదే ఏ పని జరగడంలేదన్నారు. గజపతి నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం అవ్వడంతో  పాటు బైపాస్‌ రోడ్డు, పరిశ్రమ కూడా కూడా వస్తుందని ప్రజలు, నిరుద్యోగులు ఆశతో ఎదురుచూస్తున్నారన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం అయితే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top