నిబంధనలు పేరుతో రేషన్‌కు గండి..

రేషన్‌ కోసం వలసకూలీలు పడిగాపులు..
వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత భూమన
విజయనగరంః రేషన్‌ అందక వలస కూలీలు ఇబ్బందులు పడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు. 20 లక్షల వలస కూలీలకు రేషన్‌ సరుకులు రావడంలేదన్నారు. 19 లక్షల మంది రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసినా మంజూరు చేయడంలేదని మండిపడ్డారు. కరువు పరిస్థితుల్లో  కూలీలు వలస పోతుంటే నిబంధనల పేరుతో రేషన్‌కు గండికొట్టడం అన్యాయమన్నారు. అధికారంలోకి వస్తూ కరువును తీసుకురావడం చంద్రబాబుకు అలవాటన్నారు. రేషన్‌కు గండి కొట్టి అందుల్లో కూడా మిగుల్చుకోవాలనే ప్రభుత్వ చర్యలు దారుణమన్నారు. దివంగత మహానేత వైయస్‌ఆర్‌ హయాంలో అడిగిన ప్రతిఒక్కరికి రేషన్‌కార్డులు ఇచ్చారని, చంద్రబాబు పాలనలో ఉన్న రేషన్‌కార్డులను కూడా  తీసివేస్తున్నారని మండిపడ్డారు. గత చంద్రబాబు 9 సంవత్సరాల పాలనలో 20 లక్షల నుంచి 30 లక్షల వరుకు రేషన్‌ కార్డులు ఇస్తే వైయస్‌ఆర్‌ హయాంలో 67 లక్షల రేషన్‌కార్డులు ఇచ్చిన ఘనత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డిది అని అన్నారు. టీడీపీ పాలనలో ప్రజలు రేషన్‌కార్డులు కోసం పడిగాపులు పడుతున్నారన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top