పోలీసులను అడ్డుపెట్టుకొని బాబు పాలన

అనంతపురం: చంద్రబాబు పోలీసులను అడ్డం పెట్టుకొని పరిపాలన చేస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. నిరుద్యోగ దీక్షలకు అనుమతి ఇవ్వకుండా.. పోలీసుల ద్వారా ఉద్యమాన్ని అణచివేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నాడని మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగులకు రూ. 2 వేల భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వైయస్‌ఆర్‌ సీపీ విద్యార్థి విభాగం దీక్ష చేపడితే దాన్ని అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. హామీలను అమలు చేయాలని కోరితే అరెస్టు చేయడం హేయనీయమన్నారు. న్యాయం చేయాలని కోరిన వారిని అరెస్టు చేస్తున్నారు కానీ.. పోలీసులను దూషించిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. 
 

తాజా వీడియోలు

Back to Top