బాబు విదేశాలకు తరలించిన ప్రజాధానాన్ని తిరిగి తెప్పిస్తాం


– పశ్చిమ గోదావరి జిల్లాకు చంద్రబాబు ఏం చేశారు?
– రౌడీయిజాన్ని, దౌర్జన్యాలను, దోపిడీదారులను అక్రమమైనింగ్‌ను ప్రోత్సహించారు
– ఒడిశా, ఛత్తీస్‌గడ్‌ ప్రభుత్వాలతో కేసులు వేయించారు
– 2014లోనే పోలవరం ప్రారంభించి ఉంటే ప్రయోజనం ఉండేది
– పోలవరంలో టీడీపీ నేతలు ఎంత అవినీతికి పాల్పడ్డారో ప్రజలకు తెలుసు
– ముడుపుల కోసమే చంద్రబాబు పోలవరం తెచ్చుకున్నారు
– ప్రతి పౌరుడికి ప్రయోజనం అందేలా నవరత్నాలు ప్రకటించాం
– వైయస్‌ జగన్‌ మంచి పరిపాలన అందించగలరు
– రూ.5 లక్షల కోట్ల ప్రజధానాన్ని దోచుకుని విదేశాలకు తరలించారు
– ప్రజారంజక పాలన అందించేందుకే ప్రజా సంకల్ప యాత్ర
–  బీజేపీతో టీడీపీ రహస్య ఒప్పందం 


పశ్చిమ గోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలిపిస్తే చంద్రబాబు రాష్ట్రంలో అక్రమంగా దోచుకొని విదేశాలకు తరలించిన ప్రజాధనాన్ని తిరిగి తెప్పిస్తామని వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు రూ.5 లక్షల కోట్లు విదేశాలకు తరలించారని, ఆ డబ్బు  రాష్ట్ర ఖజానాకు వస్తే ప్రజా సమస్యలు తీరుతాయన్నారు. ప్రజా రంజక పాలన అందించాలని వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారని, ఆ యాత్ర విజయవంతంగా కొనసాగుతుందన్నారు.  వైయస్‌ జగన్‌ మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించగలరని, మంచి పాలన అందించగలరన్నారు. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్‌ఆర్‌సీపీ నేత నాని అధ్యక్షతన సమన్వయకర్తలు, విభాగాల అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల్లో పార్టీ ప్రణాళిక ఎలా ఉండాలి? టీడీపీని సమర్ధవంతంగా ఎలా ఎదుర్కొవాలి, ఎలా విజయం సాధించాలని  అన్న అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పశ్చిమ గోదావరి జిల్లాకు ఎంత న్యాయం చేశారన్నది ద్వారాక తిరుమల వెంకన్న సాక్షిగా చంద్రబాబు ప్రమాణం చేసి చెప్పాలని విజయసాయిరెడ్డి డిమాండు చేశారు. 

దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి 2004 నుంచి ప్రారంభించిన పోలవరంలోని కుడి, ఎడమ కాల్వలు చంద్రబాబు ఎందుకు అడ్డగించారని, కోర్టులో కేసులు వేసిన విషయాన్ని ప్రజలకు చెప్పాలన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును ఎందకు చేపట్టలేదని ప్రశ్నించారు. తన హయాంలో పోలవరం ప్రాజెక్టును పట్టించుకోకుండా, వైయస్‌ఆర్‌ హయాంలో ఒడిశా. ఛత్తీ‹స్‌గడ్‌ ప్రభుత్వాలతో చంద్రబాబు కేసులు వేయించారన్నారన్నారు. 2014లో పోలవరం ప్రాజెక్టును అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రారంభించి ఉంటే , కేంద్రమే ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు చేపట్టి ఉంటే పూర్తి అయ్యేదన్నారు. చంద్రబాబు తీసుకోవడం వల్ల పోలవరంలో అవినీతి జరుగుతుందన్నారు. పోలవరంలో ఎంత అవినీతికి పాల్పడ్డారన్న విషయం ఏపీ ప్రజలకు తెలుసు అన్నారు. కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ముడుపుల కోసం తీసుకొని కాలయాపన చేశారన్నారు. చంద్రబాబు ఈ విషయంపై తప్పకుండా ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 2014లో 15 స్థానాలకు 15 సీట్లు టీడీపీకి ఇస్తే..ఈ జిల్లాకు చంద్రబాబు ఏం చేశారని నిలదీశారు. ఈ జిల్లాకు రౌడీయిజం, దౌర్జన్యాలను, అక్రమ  మైనింగ్, ఇసుక తవ్వకాలను ప్రోత్సహించారన్నారు. కొల్లేరు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు బాధాకరమన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం జిల్లా ప్రయోజనాలను తుంగలో తొక్కారన్నారు. 2014 నుంచి అక్రమ క్వారీ తవ్వకాలను టీడీపీ ప్రతి ఎమ్మెల్యే భూ దందాలు, ఇసుక దందాలకు పాల్పడి ప్రజలకు ప్రజారంజకమైన పాలన అందించకుండా ప్రజా కంఠకులుగా మారారని విమర్శించారు.
2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే రుణాలు మాఫీ చేస్తామని మాట ఇచ్చి మోసం చేసింది వాస్తవం కాదా అన్నారు. డ్వాక్రా మహిళలతో సన్మానం చేయించుకోవడం మోసం కాదా అన్నారు. మిమ్మల్ని సన్మానించిన మహిళలు నిరుత్సాహానికి గురయ్యారని విమర్శించారు. గత నాలుగున్నరేళ్ల టీడీపీ పాలన అవినీతిమయమన్నారు. వైయస్‌ఆర్‌సీపీని గెలిపించండి..ఏ ప్రజాధనాన్నైతే విదేశాలకు తరలించారో ఆ దోషులందరినీ ^è ట్టం ముందు నిలబెడతామని, దుర్వినియోగం చేసిన ఆ సొమ్మంతా రాష్ట్ర ఖజానాలో జమ చేస్తామన్నారు. చంద్రబాబు దోచుకున్న రూ.5 లక్షల కోట్ల ప్రజాధానాన్ని రికవరీ చేస్తే సింగపూర్‌లోని తలసరి ఆదాయం ఏపీలో కూడా సాధించే అవకాశం ఉందన్నారు. ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చే సుకోవచ్చు అన్నారు. ప్రతి గ్రామానికి రోడ్లు వేయించుకోవచ్చు. పేదలందరికీ ఇల్లు కట్టించుకోవచ్చు అన్నారు. విదేశాలకు తరలించిన సొమ్మును తిరిగి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

 మంచి ప్రజారంజక పాలన అందించాలన్న సదుద్దేశంతో వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ గత నవంబర్‌ నుంచి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారన్నారు. ప్రస్తుతం 12వ జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతుందని వివరించారు. వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాల పథకాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. ఆ నవరత్నాలను మరింత మెరుగ్గు తీర్చి దిద్ది ప్రజలందరికీ కులాలకు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్క పౌరుడు ప్రయోజనం పొందేలా, గతంలో వైయస్‌ఆర్‌ ఎలా మంచి పాలన అందించారో అలాVó  తండ్రికి తగ్గ తనయుడిగా వైయస్‌ జగన్‌ చేస్తారన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో వచ్చిన సమస్యలను ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తున్నామన్నారు. ప్రజలందరూ కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా? ఎప్పుడు వైయస్‌ జగన్‌ను సీఎం చేసుకుందామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. 
– రాష్ట్ర విభజనకు కాంగ్రెస్‌ పార్టీ కారణమని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. రెండు కళ్ల సిద్ధాంతంలో రాష్ట్ర విభజనకు టీడీపీ మద్దతిచ్చిందన్నారు. అలాంటి టీడీపీ, కాంగ్రెస్‌ జత కట్టి ఎన్నికలకు వెళ్తే రెండు పార్టీలకు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఆ రెండు పార్టీల కలయిన అనైతికమన్నారు. టీడీపీ ఎలక్ట్రోరల్‌ రూల్స్‌లో ఎవరైతే వ్యతిరేకంగా ఓటు వేస్తారో అని భావిస్తే అలాంటి ఓట్లను చట్టవిరుద్ధంగా తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో వైయస్‌ఆర్‌సీపీ పోరాటం చేస్తుందన్నారు. నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బోగస్‌ ఓట్లను తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఎన్నికలు రాబోతున్నాయని టీడీపీకి అనుకూలంగా ఉన్న అధికారులను బదిలీ చేసుకుంటున్నారన్నారు. ఇలాంటి అన్యాయాన్ని అరికట్టాల్సిన అవశ్యకత ఉందన్నారు. ఎన్నికల సంఘం ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరారు. 
చంద్రబాబు ఈ రోజు ఐటీ దాడులు అంటే భయపడుతున్నారన్నారు. ఎవరైతే అక్రమార్జనకు పాల్పడి పన్నులు చెల్లించకపోతే ఐటీ దాడులకు భయపడుతారన్నారు. చంద్రబాబు దొంగ కాబట్టే ఐటీ దాడులకు భయపడుతున్నారన్నారు. ఇటీవల కేబినెట్‌ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారన్నారు. ఐటీ దాడులు జరిగితే రాష్ట్రంలోని పోలీసు ఫోర్సు పంపించకూడదని నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. ఇలాంటి అవస్యకత ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు కుమారుడు లోకేష్‌ ఈ విషయాన్ని మీడియాకు తెలిపారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఏజెన్సీలకు పోలీసు సపోర్టు ఇవ్వకపోతే అక్రమాలను వెలుగులోకి రావన్నారు. రాష్ట్రం సహకరించకపోతే కేంద్ర ప్రభుత్వ సిబ్బంది రంగంలోకి వస్తారన్నారు. రాబోయే ఎన్నికల అనంతరం చంద్రబాబు విజయమాల్యా, నీరవ్‌మోడీ మాదిరిగా దేశం వదిలివెళ్తారని అనుమానం వ్యక్తం చేశారు. వారు పారిపోకుండా ఉండేందుకు ముందస్తుగా చంద్రబాబు కుటుంబ సభ్యుల పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకోవాలని కోరారు. టీడీపీ, బీజేపీలు ఒకరికొకరు సహకరించుకుంటున్నారని, ఎన్నికల అనంతరం టీడీపీ బీజేపీకి మద్దతు ఇస్తుందని అనధికారికంగా చంద్రబాబు చెప్పారన్నారు. గతంలో ప్రతి పార్టీతో పొత్తు పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు అన్నారు. మాపై చేసే ఆరోపణలు చేయడం సరికాదని, పొత్తుల విషయంలో మా పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా..అదే మాకు శిరోధార్యమని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. 



 
Back to Top