దోషులెవరో నిగ్గు తేల్చాల్సిందే


న్యూఢిల్లీ: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.  వైయస్‌ జగన్‌ను అంతమొందించాల్సిన అవసరం శ్రీనివాసరావుకు లేదని, దీని వెనుక పెద్ద కుట్ర ఉందని పేర్కొన్నారు. ఈ కుట్ర వెనుక ఉన్న వ్యక్తులు ఎవరో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి కాబోయే వ్యక్తిని అంతమొందించాల్సిన అవసరం ఎవరికి ఉందో ప్రజలందరికీ తెలుసు అన్నారు. ఈ ఘటనపై జ్యుడిషియల్‌ విచారణ చేపట్టాలని డిమాండు చేశారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని అంతమొందించాలి అనుకునే నీచమైన ఆలోచన రావడం దుర్మార్గమన్నారు. రాష్ట్రపతికి కూడా ఇదే విషయాలను వివరించామన్నారు. ఈ ఘటనపై తప్పనిసరిగా విచారణ జరుగబోతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిందిస్తుందని, కేంద్రం కూడా స్పందించి నిష్పక్షపాత విచారణ చేపట్టాలని కోరారు.  
Back to Top