ప్రజలకన్నా సమావేశాలే ముఖ్యమా బాబూ..?
ప్రజలు నీళ్లు లేక అల్లాడుతుంటే పట్టదా తక్షణమే తాగునీటి సమస్యను పరిష్కరించాలివిజయవాడ నగర అధ్యక్షుడు వంగవీటి రాధా
విజయవాడ: ప్రజలు తాగడానికి గుక్కెడు నీళ్లు లేక అవస్థలు పడుతుంటే...చంద్రబాబు మాత్రం ఏసీ గదుల్లో కూర్చొని కాలక్షేపం చేస్తున్నారని వైయస్సార్సీపీ విజయవాడ నగర అధ్యక్షుడు వంగవీటి రాధా మండిపడ్డారు. ప్రజలకన్నా మీకు సమావేశాలే ముఖ్యమా బాబు అని నిలదీశారు. విజయవాడలో రెండు రోజుల కలెక్టర్ల సదస్సు జరుగుతున్న విషయం విదితమే. ఈనేపథ్యంలో సదస్సు వద్దకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున చేరుకొని ధర్నా నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నగరంలో నెలకొన్న తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈసందర్భంగా వంగవీటి రాధా మీడియాతో మాట్లాడుతూ...ప్రజలకు తాగునీరు సరఫరా చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో తాగునీటి సమస్య తీవ్రస్థాయిలో ఉన్నా బాబు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతుంటే బాబు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం ఎంతవరకు సమాంజసమని ప్రశ్నించారు. అధికారం కోసం అమలు గాని హామీలిచ్చి...తీరా గద్దెనెక్కాక ప్రజలను పట్టిపీడిస్తున్నారని విమర్శించారు. నగర ప్రజలకు నీరందిస్తామని ప్రభుత్వం ప్రకటించేవరకు ధర్నా విరమించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.