రాష్ట్రపతితో మధ్యాహ్నం పార్టీ బృందం భేటి

న్యూఢిల్లీ, 27 ఆగస్టు 2013:

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం మంగళవారం ఉదయం ఢిల్లీ చేరుకుంది. ఉదయం 11.30 గంటలకు ఈ బృందం పార్లమెంటు హౌస్‌లో ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌తోను, మధ్యాహ్నం 1.15 నిమిషాలకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతోనూ భేటి అవుతుంది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి కాంగ్రెస్‌ పార్టీ ఏకపక్షంగా, నిరంకుశంగా తీసుకున్న నిర్ణయంతో సీమాంధ్ర అట్టుడికిపోతున్న నేపథ్యంలో పార్టీ ప్రతినిధి బృందం ఢిల్లీకి వచ్చారు. ఈ క్రమంలో ఈ బృందం సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనల తీరును కేంద్ర ప్రభుత్వానికి వివరిస్తుంది.

ఈ ప్రతినిధి బృందంలో పార్టీ ఎం.పి., ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దూరదృష్టి లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిరంకుశంగా తీసుకున్న నిర్ణయంవల్ల రగిలిపోతున్న పరిస్థితులు, సీమాంధ్ర ప్రజల ఆందోళనలను రాష్ట్రపతి దృష్టికి తెచ్చి పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేయనున్నారు.‌

Back to Top