2 నుంచి వైయ‌స్ఆర్ జిల్లాలో వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

హైద‌రాబాద్‌: వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫిబ్ర‌వ‌రి 2వ తేదీ నుంచి మూడు రోజుల పాటు  వైయ‌స్‌ఆర్‌ జిల్లాలో పర్యటిస్తున్నట్లు కడప ఎంపీ వైయ‌స్‌ అవినాష్‌రెడ్డి తెలిపారు. గురువారం నుంచి ఆయన పర్యట ప్రారంభమై శనివారం ముగుస్తుంద‌న్నారు.


2వ తేదీ(గురువారం): ఉదయం పులివెందులలోని వైయ‌స్‌ ప్రకాశ్‌ రెడ్డి ఇంటికెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పలకరిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి తన పీఏ డీ రవి శేఖర్‌ ఇంటికెళ్లి అతడి కుటుంబ సభ్యులను ఓదారుస్తారు. రవి భార్య తీవ్ర అనారోగ్యం కారణంగా సోమవారం చనిపోయారు. అనంతరం అక్కడి నుంచి ఇడుపుల పాయలోని ఎస్టేట్‌కు చేరుకుంటారు.

3వ తేదీ(శుక్రవారం): ఉదయం 8.30 గంటలకు పులివెందులలోని పాల్‌ ఫంక్షన్‌ హాలులో జరగనున్న సైదాపురం ఓబుల రెడ్డి కూతురు వివాహ కార్యక్రమానికి వైయ‌స్ జ‌గ‌న్ హాజ‌ర‌వుతారు. అనంతరం 8.45గంటలకు అక్కడే టీడీడీ ఫంక్షన్‌ హాలులో అలవాలపాడు వెంకటేశ్వర రెడ్డి కుమారుడి వివాహానికి హాజరై నవదంపతులను ఆశీర్వదిస్తారు. 10.15 గంటలకు దేవుని కడపలోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి దైవదర్శనం చేసుకుంటారు. అక్కడి నుంచి 11.30కు కడపలోని జయరాజ ఫంక్షన్‌ హాలులో ఎంపీటీసీ, జెడ్‌పీటీసీలు, కౌన్సిలర్ల సమావేశానికి హాజరవుతారు.

4వ తేదీ(శనివారం): ఉదయం 9.30గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి పైడీపాలెం డ్యాంను సందర్శిస్తారు. 11.00గంటలకు అక్కడి నుంచి నేరుగా చెర్లోపల్లి పంప్‌ హౌజ్‌ వద్దకు వెళ్లి సంబంధిత అధికారుల వద్ద వివరాలు తెలుసుకుంటారు.
Back to Top