గ‌వ‌ర్న‌ర్ తేనేటి విందుకు వైయ‌స్ జ‌గ‌న్‌

హైదరాబాద్: ఉమ్మ‌డి రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్ రాజ్‌భ‌వ‌న్‌లో సోమ‌వారం ఎట్ హోం కార్య‌క్ర‌మం పేరుతో తేనేటి విందు ఇచ్చారు. కార్య‌క్ర‌మానికి  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్‌ను గ‌వ‌ర్న‌ర్ సాధ‌రంగా ఆహ్వానించారు. కార్య‌క్ర‌మానికి ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌రు కాగా, వైయ‌స్ జ‌గ‌న్‌ను తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌లుక‌రించి క‌ర‌చాల‌నం చేశారు. కాగా కేసీఆర్ వైయ‌స్ జ‌గ‌న్ స‌ర‌దాగా మాట్లాడుకోవ‌డం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top