కడపకు నీళ్లు తెచ్చిన ఘనత వైయస్‌ఆర్‌దే

 

వైయస్‌ఆర్‌ జిల్లా: కృష్ణా జలాలను కడపకు తెచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డికే దక్కుతుందని  మాజీ మంత్రి, వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత వైయస్‌ వివేకానందరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం వైయస్‌ఆర్‌ జిల్లాలోని చిత్రావతి జలాశయాన్ని ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి, మేయర్‌ సురేష్‌బాబులతో కలిసి వివేకానందరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క అబద్ధాన్ని వందసార్లు చెప్పి నమ్మించే సిద్ధాంతం టీడీపీది అని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు నిర్మాణం వల్లే సీమకు కృష్ణా జలాలు వచ్చాయన్నారు. జలయజ్ఞం ద్వారా న్యాయం చేసింది మహానేత అని గుర్తు చేశారు.

 

తాజా ఫోటోలు

Back to Top