హరినాథ్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన వైయస్ జగన్

అనంతపురం: ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేపట్టిన ఐదో విడత రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. 

ఐదవ రోజు యాత్రలో భాగంగా కదిరి నియోజకవర్గంలోని నల్లమడ మండలం పులగంపల్లిలోకి చేరుకున్న  వైఎస్ జగన్ కు ప్రజలు ఘన స్వాగతం పలికారు.  
అక్కడి నుంచి  ఆయన వడ్డివారి పల్లె చేరుకొని రైతు హరినాథ్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శిస్తూ వైయస్ జగన్ వారిలో ధైర్యం నింపుతున్నారు. అధైర్య పడొద్దని, అండగా ఉంటామని భరోసానిస్తున్నారు. 
Back to Top