పైడిపాలెం రిజ‌ర్వాయ‌ర్‌ను ప‌రిశీలించిన వైయ‌స్ జ‌గ‌న్‌

వైయ‌స్‌ఆర్‌ జిల్లా  

:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి జిల్లాలోని పైడిపాలెం రిజర్వాయర్‌ను పరిశీలించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. పైడిపాలెం రిజర్వాయర్‌ లో 80 శాతం పనులు దివంగత నేత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి పూర్తి చేస్తే, అంతా తానే చేశానంటూ సీఎం చంద్రబాబునాయుడు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. రూ.300 కోట్లు ఖర్చు పెడితే ఈ పాటికి రాయలసీమ సస్యశ్యామలమయ్యేదని తెలిపారు. చంద్రబాబుకు ప్రాజెక్టులపై కంటే.. కాంట్రాక్టుల మీద వచ్చే కమీషన్ల మీదే ఆసక్తి ఎక్కువని వైయ‌స్ జ‌గ‌న్ మండిపడ్డారు. పురుషోత్తపట్నం ప్రాజెక్టు పనులపై విచారణ జరిపేందుకు కానిస్టేబుల్‌ చాలు అని వైయ‌స్‌ జగన్‌ సూచించారు. రూ.120 కోట్ల పరిహారం చెల్లిస్తే పులిచింతలలో 45 టీఎంసీల నీటిని నిల్వ చేయడంతో పాటూ, ప్రకాశం బ్యారేజీ నుంచి వృధాగా సముద్రంలో కలిసే 55 టీఎంసీల నీటిని కాపాడునే వాళ్లమని పేర్కొన్నారు. ప్రాజెక్టులపై చంద్రబాబుది ప్రచార ఆర్భాటమేనని ఎద్దేవా చేశారు.

Back to Top