వై ఎస్‌ఆర్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరాముడి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రామయ్యకు విశేష పూజలు నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం మధ్య కోదండరాముడు రథంపై ఊరేగాడు. సీతారామలక్ష్మణుల దివ్య మంగళ రూపాన్ని భక్తులు దర్శించి తరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించిన రథం వద్దకు ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి ఆశీనులను చేశారు. రామనామస్మరణ మిన్నంటుతుండగా రథ చక్రాలు ముందుకు కదిలాయి.