కాల్ మనీ పాపం చంద్రబాబుదే.!

హైదరాబాద్ ) ప్రతిపక్ష నేత , వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర నాయకులతో కలిసి గవర్నర్‌ నరసింహన్ ను రాజ్ భవన్ లో కలిశారు.  రెండు ప్రధానాంశాలపై ఆయనను జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు రెండు వినతి పత్రాలు సమర్పించారు. ఇందులో ప్రధానంగా గిరిజనుల సలహా మండలి ఏర్పాటు చేయాలని, కాల్ మనీ అంశంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. కాల్ మనీ బాగోతంలో చంద్రబాబు వైఖరిని తూర్పార బట్టారు.

వైఎస్ జగన్ ఏమన్నరో ఆయన మాటల్లోనే విందాం..

విజయవాడ - గుంటూరు నగరాలను మాఫియా నగరాలుగా మార్చేశారు. ఇసుక మాఫియా, మద్యం మాఫియా,ల్యాండ్ మాఫియా, చివరకు కాల్ మనీ సెక్స్ రాకెట్ మాఫియా కూడా అక్కడే జరుగుతున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి వీటిని ప్రోత్సహించి నడిపిస్తున్నారు.

అంతెందుకు.. తెలుగుదేశం పార్టీ విప్, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇసుక మాఫియా చేస్తూ ఎమ్మార్వో జుట్టు పట్టుకు లాగినా కేసు ఉండదు, పైగా ముఖ్యమంత్రే చివరకు ఎమ్మార్వోనే తిడతారు, బెదిరిస్తారు. అయినా సరే కేసులు ఉండవు. అదే చింతమనేని..  కొల్లేరులోకి అడ్డగోలుగా రోడ్డు వేయించారు, అది కూడా అటవీ అధికారుల్ని తిట్టి, తోసేసి ..వేయించుకొన్నారు. దీనికి మీడియా మొత్తం, ప్రజలు ఇందుకు సాక్ష్యం. అయినా కేసులుండవు. ఇదే చింతమనేని ప్రభాకర్ సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తారు. ఆయన అంగన్‌వాడీ మహిళల్ని  నోటికి వచ్చినట్లు తిడతారు. మహిళల్ని ఏ మనిషీ తిట్టని తిట్లు తిడితే, అంగన్‌వాడీ మహిళలు చంద్రబాబుకు, ప్రభాకర్‌కు వ్యతిరేకంగా ధర్నా చేస్తే కేసులు ఉండవు. కనీసం ఎమ్మెల్యేను మందలించరు.

ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబే స్వయంగా లిక్కర్ మాఫియా నడుపుతూ ఎమ్మార్పీపైన అధిక ధరకు లిక్కర్ అమ్ముకోడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ప్రతీ షాపు నుంచి ముడుపులు అందుతాయి. చివరకు అక్కడితో ఆగకుండా కల్తీ మద్యాన్ని కూడా సరఫరా చేయిస్తున్నారు. అయినా కేసులుండవు.. నామమాత్రంగా ఒక కానిస్టేబుల్‌నో, ఎస్ఐనో సస్పెండ్ చేస్తారు

ఇక, కాల్ మనీ రాకెట్ అంటే యావత్ ఆంధ్రప్రదేశ్ సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. చంద్రబాబు డబ్బు, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల డబ్బు కూడా అందులో ఉంది. అధిక వడ్డీలు కట్టలేకపోతే మహిళల మానప్రాణాలతో కూడా ఆటలు ఆడుకున్నారు. పోలీసులు సోదాలు చేస్తే.. 200 వీడియోలు  దొరికాయి. అంటే వాళ్లతో బలవంతంగా కొనసాగించాలన్న దుర్మార్గమైన ఆలోచన. ఇదే రాకెట్ నిందితులతో కలిసి టీడీపీ ఎమ్మెల్యేలు షికార్లు చేస్తారు, విదేశీ యాత్రలు చేస్తారు. మీడియాకు ఫొటోలు వస్తాయి, కానీ, కేసులుండవు. ఒక ఎమ్మెల్సీ కేసులో దొరికినా కేసులు ఉండవు. చివరకు ఆ ఎమ్మెల్సీ సోదరుడు దీనికి సూత్రకర్త, అయినా కేసులు ఉండవు.

దీంతో పాటు గిరిజనుల సలహా మండలి ఏర్పాటు చేయాలని కోరినట్లు వైఎస్ జగన్ మీడియాకు వివరించారు. 


తాజా వీడియోలు

Back to Top