నందిగామ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

 నందిగామ: బస్సు ప్రమాద మృతుల కుటుంబాలను, బాధితులను ఓదార్చేందుకు వచ్చిన ప్రతిపక్ష నాయకుడు, వైయస్సార్ సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించాయి.  బాధలో ఉన్నవారిని పరామర్శించేందుకు నందిగామ ప్రభుత్వాసుపత్రికి వచ్చిన ప్రతిపక్ష నాయకుడికి అడ్డంకులు కల్పించేందుకు పూనుకున్నారు. విపక్ష నేతను అడ్డుకోవడం తగదని వైయస్సార్ సీపీ నాయకులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోకుండా తమ శైలిలో దురుసుగా ప్రవర్తించారు.

జగన్ రాకముందే మృతదేహాలను తరలించాలని అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఆస్పత్రిలోకి వెళ్లకుండా జగన్ ను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కాసేపటి తర్వాత జగన్ ఆస్పత్రిలోకి వెళ్లి బాధితులను పరామర్శించారు. ప్రమాద వివరాలను క్షతగాత్రులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు ఆస్పత్రిలోకి దూసుకురావడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జగన్ మీడియాతో మాట్లాడుతుండగా పోలీసులు, అధికారులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును వైయస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా నిరసించారు.

అంతకుముందు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాల‌ను ఆదుకోవాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఆందోళ‌న చేప‌ట్టారు. మృతుల కుటుంబాల‌కు చంద్ర‌న్న బీమాతో స‌రిపెట్టాల‌ని ప్ర‌భుత్వం చూడ‌టం, ఈ ఘ‌ట‌న‌కు బాధ్యుడైన డ్రైవ‌ర్‌ను టీడీపీ నేత‌లు ఆసుప‌త్రి నుంచి త‌ర‌లించ‌డంతో వైయ‌స్ఆర్ సీపీ నేత‌లు ధ‌ర్నా చేప‌ట్టారు. డ్రైవ‌ర్‌ను ఎందుకు త‌ప్పించార‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి పార్థ‌సార‌ధి ప్ర‌శ్నించారు. ఒక్కో కుటుంబానికి రూ.20 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా చెల్లించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.
Back to Top