వైయస్‌ జగన్‌పై హత్యాయత్నంవిశాఖ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై విశాఖ ఎయిర్‌ పోర్టు లాంజ్‌లో హత్యాయత్నం జరిగింది. ఎయిర్‌పోర్టు లాంజ్‌లో కూర్చున్న వైయస్‌ జగన్‌ను పలకరించి, సెల్ఫీ తీసుకునేందుకు వచ్చిన వెయిటర్‌ తన వద్ద ఉన్న కత్తితో భుజానికి గుచ్చాడు. కోడిపందెలలో ఉపయోగించే కత్తితో దాడికి పాల్పడటంతో రక్తస్రావం అయ్యింది. వెంటనే సెక్యూరిటీ అప్రమత్తమయ్యారు. నిందితుడు ఎయిర్‌ పోర్టు సిబ్బందిగా గుర్తించారు. పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. వైయస్‌ జగన్‌పై జరిగిన దాడిని వైయస్‌ఆర్‌సీపీ తీవ్రంగా ఖండించింది. దాడికి పాల్పడిన వ్యక్తిని శిక్షించాలని పార్టీ నాయకులు డిమాండు చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడికి రక్షణ లేకుండా పోయిందంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
 

తాజా వీడియోలు

Back to Top