నేడు వైఎస్ జ‌గ‌న్ రాక‌


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ శాస‌న‌స‌భ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మూడు రోజుల పాటు వైఎస్సార్ జిల్లా లో ప‌ర్య‌టించ‌నున్నారు. సోమ‌వారం మ‌ధ్యాహ్నం ఆయ‌న‌ పులివెందుల‌కు రానున్న‌ట్లు క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. సోమ‌వారం ఉద‌యం వైఎస్ జ‌గ‌న్ బెంగుళూరులో బ‌య‌లుదేరి మ‌ధ్యాహ్నానికి పులివెందుల‌కు చేరుకుంటార‌న్నారు. మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌నుంచి త‌న క్యాంపు కార్యాల‌యంలో పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటారు. 18న మంగ‌ళ‌వారం ఉద‌యం 9 గంట‌ల‌కు సింహాద్రిపురం మండ‌లం బ‌ల‌ప‌నూరు స‌ర్పంచ్ స‌ర‌స్వ‌త‌మ్మ కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శిస్తార‌న్నారు. అనంత‌రం సింహాద్రిపురం మండ‌లంలో ఎండిన వేరుశ‌న‌గ‌, ప‌త్తి పంట‌ల‌ను అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలిస్తారు. మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు పులివెందుల ఆర్ండ్‌బీ గెస్ట్ హౌస్‌లో పీబీసీ, ఆర్‌డ‌బ్లుయెస్ అధికారుల‌తో పాటు మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌, ఇత‌ర అధికారుల‌తో పీబీసీకి నీటి కేటాయింపుల‌పై స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హిస్తారు. 19న ఉద‌యం త‌న క్యాంపు కార్యాల‌యంలో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటారు. 12.30గంట‌ల‌కు పులివెందుల‌లోని వీజే ఫంక్ష‌న్ హాలులో వైఎస్సార్‌సీపీ నాయ‌కుడు రాయ‌లాపురం భాస్క‌ర్‌రెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుక‌ల‌కు హాజ‌ర‌వుతారు. రాత్రి హైద‌రాబాద్‌కు బ‌య‌లుదేరి వెళ‌తారు.
Back to Top