బంద‌ర్ పోర్టు నిర్మిస్తా



- టీడీపీ పాల‌న‌లో ఊరూరా బెల్టు షాపులే
- అధికార పార్టీ  నేత‌లు శ్మాశానాన్ని, మ‌రుగుదొడ్ల‌ను వ‌ద‌ల‌డం లేదు
- బంద‌ర్‌కు ప్ర‌కాశం బ్యారేజీ నీరు రావ‌డం లేదు
- ఇళ్ల నిర్మాణం పేరుతో చంద్ర‌బాబు స్కాం
- పేద‌లంద‌రికీ ప‌క్కా ఇల్లు నిర్మిస్తాం
- వ‌ల‌స‌లు నివారిస్తాం
- ఉద్యోగాల విప్ల‌వం తీసుకువ‌స్తాం

కృష్ణా జిల్లా:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బంద‌ర్ పోర్టును నిర్మిస్తామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హామీ ఇచ్చారు. కేవ‌లం 4800 ఎక‌రాల్లో పోర్టు నిర్మిస్తామ‌ని, టీడీపీ ప్ర‌భుత్వం భూ సేక‌ర‌ణ ద్వారా తీసుకున్న 39 వేల ఎక‌రాల‌ను రైతుల‌కు వెన‌క్కి ఇప్పిస్తామ‌ని మాట ఇచ్చారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా మ‌చిలీప‌ట్నంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో అశేష జ‌న‌వాహినిని ఉద్దేశించి  వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగించారు. ఆయ‌న ఏమ‌న్నారంటే.. వైయ‌స్ జ‌గ‌న్ మాట‌ల్లోనే..

ఈ నియోజ‌క‌వ‌ర్గంలో అడుగుపెడుతూనే స‌మ‌స్య‌లు చెప్పుకుంటూ వ‌స్తున్న‌ప్పుడు, అక్క‌చెల్లెమ్మ‌ల నుంచి ఆ స‌మ‌స్య‌ను వింటున్న‌ప్పుడు కాపాడాల్సిన వ్య‌వ‌స్థే ద‌గ్గ‌రుండి ద‌గా చేస్తుంటే బాధ‌నిపించింది. అన్నా..చంద్ర‌బాబు సీఎం అయ్యేట‌ప్పుడు నాలుగు సంత‌కాలు పెట్టార‌న్నా..ఆ సంత‌కాల్లో బెల్టు షాపులు ర‌ద్దు అన్నారు. అన్నా..బెల్టు షాపులు అడ్డుకోవాల్సింది ఎవ‌ర‌న్నా..ద‌గ్గరుండి మంత్రి బెల్టు షాపుల‌కు వేలం వేయిస్తున్నారు. ద‌గ్గ‌రుండిప్ర‌జ‌లతో తాగించ‌డం, గ్రామాల్లో ఇష్టం వ‌చ్చిన రేట్ల‌కు  అమ్ముకునేందుకు వేలం పాట‌లు నిర్వ‌హించ‌డం బాధ‌నిపించింది.
- ఇక్క‌డి అక్క‌చెల్లెమ్మ‌లు బెల్టు షాపుల గురించి చెబితే..మ‌రికొంద‌రు అన్న‌ద‌మ్ములు ఏమ‌న్నారో తెలుసా..మా ప్రాంతంలో నాయ‌కులు పార్కులు, బహిరంగ స్థ‌లాలు ఆక్ర‌మించుకొని అమ్ముకుంటున్నారు. చివ‌ర‌కు శ్మ‌శానాన్ని కూడా వ‌ద‌ల‌డం లేదు. మంత్రులుగా ఉన్న వ్య‌క్తులు ద‌గ్గ‌రుండి ఆక్ర‌మించుకుంటున్నారు. 
-ఈ నియోజ‌క‌వ‌ర్గంలో భూ కబ్జాలు ఏ స్థాయికి వెళ్లాయంటే..ఎన్‌టీ రామారావు భార్య బ‌స‌వ‌తార‌కం బంధువు శివ‌లీల‌మ్మ నావ‌ద్ద‌కు వ‌చ్చి అన్నా..మాకు కొన్ని భూములు ఉన్నాయ‌న్నా..అమ్మే విష‌యంలో భూత‌గాదాలు వ‌చ్చాయి. త‌క్కువ రేటుకుభూములు కొంటామంటే మేం ఒప్పుకోకుంటే మా పిల్ల‌ల‌ను, ఆడ‌వాళ్ల‌ను స్టేష‌న్‌కు తీసుకెళ్లారు. నాలుగు రోజుల పాటు మ‌మ్మ‌ల్ని తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేశార‌ని ఆమె చెబుతుంటే బాధ‌నిపించింది. వ్య‌వ‌స్థ‌ను కాపాడ‌వ‌ల్సిన మంత్రులు, పోలీసులు ఎలా ఉన్నారో అర్థమ‌వుతుంది.
- అన్నా..నాన్న‌గారి హ‌యాంలో ప్ర‌తి పేద‌వాడికి ఇల్లు ఇచ్చార‌న్నా..ఇవాళ నాలుగేళ్లు అయిపోయింది క‌నీసం ఒక్క ఇల్లైనా క‌ట్ట‌లేని చేత‌కాని ప్ర‌భుత్వం ఇది అంటున్నారు. భూ ఆక్ర‌మ‌ణ‌లు చేసే ఈ ప్ర‌భుత్వం ఇంటి స్థ‌లాలు ఇవ్వ‌ని ప‌రిస్థితి చూస్తే బాధ‌నిపించింది.
- బెల్ కంపెనీని ఇక్క‌డి నుంచి మార్చేసి ఆ స్థ‌లంలో ఒక పెద్ద స్కాం చేయ‌బోతున్నారు. ఆ స్కామ్‌లో పేద‌వారికి ప్లాట్లు క‌ట్టిస్తార‌ట‌. ఒక్కొక్క‌రికి 300 అడుగుల ప్లాటు ఇస్తార‌ట‌. దీనికి అక్ష‌రాల అడుగుకు రూ.2 వేల చొప్పున రూ. 6 ల‌క్ష‌ల‌కు అమ్ముతార‌ట‌. రూ.3 ల‌క్ష‌లు పేద‌వాడు 25 ఏళ్ల పాటు కంతులు క‌ట్టాల‌ట‌. లంచాలు తినేది పేద‌వాడు. కంతులు క‌ట్టాల్సింది పేద‌వాడ‌ట‌.
- దేవుడి ద‌య వ‌ల్ల మ‌న ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత రూపాయి ఖ‌ర్చు లేకుండా ఇల్లు క‌ట్టిస్తాను. ఆ ఇంటిని అక్క చెల్లెమ్మ‌ల పేరుతో రిజిస్ట్రేష‌న్ చేయించి ఇస్తాను. అది అక్క‌చెల్లెమ్మ‌ల‌కు అస్తి అవుతుంది కాబ‌ట్టి ఆ ఇల్లు బ్యాంకులో తాక‌ట్టు పెడితే పావ‌లా వ‌డ్డికే రుణం వ‌చ్చేలా చేస్తాను.
- ఈ నియోజ‌క‌వ‌ర్గంలో రైతులు నా వ‌ద్ద‌కు వ‌చ్చారు. ప్ర‌కాశం బ్యారేజీ నుంచి బంద‌ర్ దాకా రావాల్సిన నీరు రావ‌డంలేదు. నాన్న‌గారి పాల‌న‌లో రెండు పంట‌ల‌కు నీళ్లు వ‌చ్చేవి. చంద్ర‌బాబు సీఎంఅయ్యారు..మా ఖ‌ర్మ చూడండి అన్నా..నాలుగేళ్లుగా వ‌రికి నీరు లేదు అంటున్నారు. సాగు, తాగునీరు లేక‌పోతే ఎలా? ఏ పంట‌కు గిట్టుబాటు ధ‌ర లేదు. 
- ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 1870వ సంవ‌త్స‌రంలో 36 వేల మంది నివాసం ఉండేవారు. ఒక్క‌సారి గ‌మ‌నించండి.  ఈ బంద‌ర్ టౌన్‌లో పేద‌రికం అధిక‌మైంది.  ఇక్క‌డ ఉపాధి లేదు. ఉద్యోగాలు రావ‌డం లేదు. పేరుకు మాత్ర‌మే జిల్లా హెడ్ క్వార్ట‌ర్‌. ఉపాధి లేక ఇక్కడి ప్ర‌జ‌లు వ‌ల‌స‌లు వెళ్తున్నారు. దాదాపుగా 10 వేల ఓట్లు త‌గ్గాయ‌న‌డానికి వ‌ల‌స‌లు ఏ స్థాయిలో వెళ్తున్నారో అర్థ‌మ‌వుతుంది.
- బంద‌ర్ టౌన్‌ను బాగు చేయాల‌ని వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఒక స్వ‌ప్నాన్ని చూశారు. 42 ఎక‌రాల‌ల్లో ఇమిటేష‌న్ పార్క్ ఏర్పాటు చేయించి రోల్‌గోల్డు వ్యాపారాలు క‌ల్పించారు. ఆ రోజుల్లో క‌రెంటు యూనిట్ రూ.3.70 ఉంటే, ఈ రోజు రూ.8.75 పైస‌ల‌కు వెళ్లింది. చంద్ర‌బాబు ఉద్యోగాల కోసం జ‌పాన్‌, సింగ‌పూర్‌, స్విడ్జ‌ర్‌ల్యాండ్ అంటారు. నీ దారుణ‌మైన చ‌ట్టాలు, పాల‌న వ‌ల్ల క‌రెంటు చార్జీలు విఫ‌రీతంగా పెరిగితే ఎలా బ‌తుకుతారు? ల‌క్ష లీట‌ర్ల నీళ్లు ఆ పార్కుకు కావాలి. ఈ పెద్ద మ‌నిషి 20 వేల లీట‌ర్లు కూడా ఇవ్వ‌డం లేదు. నాన్న‌గారు చేసిన అతిగొప్ప కార్య‌క్ర‌మం ఏంటంటే బంద‌ర్ పోర్టుకు శంకుస్థాప‌న చేయ‌డం. నాన్న‌గారు శంకుస్థాప‌న చేసి ఆ త‌రువాత చ‌నిపోయారు. ఆ త‌రువాత పోర్టు ప‌రిస్థితి గ‌మ‌నించండి
 పోర్టుకు 4800 ఎక‌రాల అవ‌స‌రం అయితే ఆరోజు టీడీపీ నేత‌లు 1800 ఎక‌రాలు స‌రిపోతుంద‌న్నారు. ఈ పెద్ద మ‌నుషులు అధికారంలోకి వ‌చ్చారు. బంద‌ర్ టౌన్‌కు ప‌క్క‌నే 33 వేల ఎక‌రాల‌కు చంద్ర‌బాబు నోటిఫికేష‌న్ జారీ చేశారు. అవ‌స‌రం ఉన్నా..లేకున్నా..రైతుల‌కు ఒక్క మాట కూడా చెప్ప‌కుండా భూసేక‌ర‌ణ నోటిఫికేష‌న్ జారీ చేశారు. రైతులంద‌రూ అవేద‌న‌తో, అక్రోశంతో ప్ర‌శ్నిస్తే చంద్ర‌బాబు పోలీసుల‌ను ఉప‌యోగించి త‌న‌కున్న బ‌లంతో రైతుల‌ను అణ‌గ‌దొక్కె కార్య‌క్ర‌మం చేస్తే ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా రెండుసార్లు బంద‌ర్‌కు రావాల్సి వ‌చ్చింది. ఇ వాల్టికి కూడా ఆ భూసేక‌ర‌ణ నోటిఫికేష‌న్ వెన‌క్కి తీసుకోలేదు. రైతులకు వ్య‌వ‌సాయ రుణాలు అంద‌డం లేదు. భూముల అమ్మ‌కాలు ఆగిపోయాయి. పిల్ల‌ల పెళ్లిల‌కు, చ‌దివించుకునేందుకు, వైద్యం కోసం ఇక్క‌డి ప్ర‌జ‌లు ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నా చంద్ర‌బాబు చోద్యం చూస్తున్నారు. 
- నిజంగా ఏ పాల‌కుడైనా ఎలా ఉండాలంటే ..ఎవ‌రైనా అభివృద్ధి కావాల‌ని ఆకాంక్షిస్తారు. అభివృద్ధికి ఎంత భూమి అవ‌స‌ర‌మో అంతే తీసుకోవాలి. రైతుల ముఖాల్లో చిరున‌వ్వులు చూసిన త‌రువాత ముంద‌డుగు వేయాలి. రేపు పొద్దున మనంద‌రి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత బంద‌ర్ పోర్టును క‌డ‌తాం..కేవ‌లం 4800 ఎక‌రాలు మాత్ర‌మే తీసుకుంటాం. 
- మ‌న ప్ర‌భుత్వం వ‌చ్చాక చారిత్మాక నిర్ణ‌యం తీసుకుంటాం. ఉద్యోగ విప్ల‌వం తీసుకొస్తాం. స్థానికుల‌కు పోర్టులో ఉద్యోగాలు క‌ల్పిస్తాం. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే ప్ర‌తిగ్రామంలో  గ్రామ స‌చివాల‌యం ఏర్పాటు చేసి స్థానికుల్లో పది మందికి అందులో ఉద్యోగాలు క‌ల్పిస్తాం. ఎలాంటి సంక్షేమ ప‌థ‌క‌మైనా 72 గంట‌ల్లో వ‌చ్చేలా చూస్తాం.
- ప్ర‌తి ఒక్క‌రి ముఖాల్లో చిరున‌వ్వులు చూసేందుకు న‌వ‌ర‌త్నాలు ప్ర‌క‌టించాం. ఇందులో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వ‌వ‌చ్చు. చెడిపోయిన ఈ వ్య‌వ‌స్థ‌ను బాగుచేసేందుకు బ‌య‌లుదేరిన మీ బిడ్డ‌ను ఆశీర్వ‌దించ‌మ‌ని కోరుతూ సెల‌వు తీసుకుంటున్నా..







Back to Top