- దిగ్విజయంగా వైయస్ జగన్ పాదయాత్ర- చిలుకలూరిపేట నియోజకవర్గంలోని ప్రజా సంకల్ప యాత్ర- సాయంత్రం కళామందిర్ సెంటర్‌లో బహిరంగ సభగుంటూరు: మండు టెండలకు భయపడటం లేదు. బతుకు కష్టాలు ఎన్ని ఉన్నా..పాలకుల దోపిడీ సాగుతున్నా..తడబడని అడుగులు పాదయాత్రలో ముందుకు మున్ముందుకు సాగుతున్నాయి. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు బయలు దేరిన వైయస్ జగన్ ఎండను సైతం లెక్క చేయడం లేదు. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. రేపటి వెలుగుల కోసం నేటి ప్రజా సంకల్పం సాక్షిగా జనం.. జనం.. ఎటు చూసినా ప్రభంజనం. ప్రజా సంకల్ప యాత్ర దారులన్నీ జనంతో పోటెత్తున్నాయి. వైయస్ జగన్‌కు దారి పొడవునా బ్రహ్మరథం పడుతున్నారు. మేడా మిద్దె, చెట్టూ పుట్ట అన్నీ కిక్కిరిశాయి. తమ కష్టాలు వినేందుకు.. కన్నీరు తుడిచేందుకు ప్రజా సంకల్ప దీక్షబూనిన పాదయాత్రికుడు వైయ స్ జగన్‌మోహన్‌రెడ్డి రాక కోసం తొలిపొద్దు పొడవకముందే పల్లెలన్నీ జనంతో పోటెత్తాయి. అడుగడుగునా పూలబాటలతో స్వాగతం పలికాయి. తమ బాధలను నిండు మనసుతో వింటూ, పరిష్కరిస్తానని భరోసా ఇస్తూ ముందుకు సాగిన జననేతను చూసి మురిసిపోయాయి. మండుటెండను సైతం లెక్క చేయకుండా మహిళలు, చిన్న పిల్లలు, విద్యార్థులు రోడ్డుపై గంటల తరబడి వేచిచూసి జననేతతో కరచాలనం చేసి ఉప్పొంగిపోయారు.
వైయస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలో దిగ్విజయంగా సాగుతోంది. బుధవారం ఉదయం ఉప్పలపాడు శివారు నుంచి 117వ రోజు పాదయాత్ర మొదలుపెట్టారు. ఇవాళ వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర చిలుకలూరిపేట నియోజకవర్గంలోని అడుగుపెట్టింది. బుధవారం జరుగులవారిపాలెం, మిట్టాపాలెం, దండముడి, మానుకొండువారిపాలెం, చిలకలూరిపేట మీదగా పోలిరెడ్డిపాలెం వరకు ఈరోజు పాదయాత్ర చేయనున్నారు. సాయంత్రం చిలకలూరిపేట పట్టణంలోని కళామందిర్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగించనున్నారు. జననేత రాకతో చిలుకలూరిపేట పార్టీ జెండాలతో కళకళలాడుతోంది. దారిపొడవునా జననేతకు స్వాగతం పలుకుతూ తోరణాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.