కొండంత అభిమానం




- జిల్లాలో 18 రోజులు.. 263 కిలోమీట‌ర్లు
- 7 నియోజకవర్గాల్లో సాగిన జ‌న‌నేత పాద‌యాత్ర‌
-  అన్ని వ‌ర్గాల‌కు భ‌రోసా క‌ల్పించిన రాజ‌న్న బిడ్డ 

కర్నూలు:  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కర్నూలు జిల్లాలో విజ‌య‌వంత‌మైంది. జ‌న‌నేత‌కు అడుగడుగునా జనం నీరాజనం పలికారు. అధికార తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను, అవినీతిని ఎదుర్కొనేందుకు కదనరంగమై వైయ‌స్ జగన్‌తో పాటు లక్షలాది అడుగులు ముందుకు సాగాయి. ప్రతి చోటా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సమస్యలను నివేదించారు. ప్రజలు చెప్పే సమస్యలను వైయ‌స్ జగన్‌ సావధానంగా వింటూ... వారికి ధైర్యం చెబుతూ ముందుకు సాగారు. జిల్లాలో నవంబరు 14వ తేదీ మొదలైన పాదయాత్ర డిసెంబరు 3వ తేదీ వరకూ సాగింది. మొత్తం 18 రోజుల పాటు సాగిన పాదయాత్రలో జిల్లాలోని 7 నియోజకవర్గాలు, 14 మండలాల్లోని 66 గ్రామాల్లో మొత్తం 263 కిలోమీటర్ల మేర జగన్‌ పాదయాత్ర చేశారు. చాగలమర్రి మండలం గొడిగనూరు గ్రామం వద్ద పాదయాత్ర 100 కిలోమీటర్లను పూర్తి చేసుకుంది. 200 కిలోమీటర్ల పాదయాత్ర బేతంచర్ల మండంలోని ముద్దవరం గ్రామం వద్ద పూర్తి అయ్యింది. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గోనెగండ్ల మండలం బి.అగ్రహారం వద్ద 300 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. ఈ సందర్భంగా జగన్‌ మొక్కలును నాటారు.   

అన్ని వ‌ర్గాల మ‌ద్ద‌తు
వైయ‌స్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు జిల్లాలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు తెలిపి, జ‌న‌నేత‌తో క‌లిసి అడుగులు వేశారు. జిల్లాలో నిర్వ‌హించిన  మహిళలు, బీసీలు, రైతులు, ఉపాధి కూలీలు, క్వారీ కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ స‌ద‌స్సుల‌కు విశేష స్పంద‌న ల‌భించింది.  పాదయాత్ర సందర్భంగా పలు సంఘాలు, సొసైటీలు, అసోషియేషన్లు వారి వారి సమస్యలపై వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు.  పాదయాత్ర సందర్భంగా దారుల‌న్నీ కిక్కిరిసిపోయాయి. ప‌ల్లెల్లో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. పక్కనే వెళ్తున్న లారీలు, ఆర్టీసీ బస్సులో ప్రయాణీకులంతా కేరింతలు కొట్టారు. కిటీకీల్లోంచి చేతులు, తలలూ బయటపెట్టి ‘అన్నా...’ అంటూ కేకలేశారు. వైయ‌స్ జగన్‌ వారితో కరచాలనం చేస్తూ ముందుకు సాగారు. రహదారులన్నీ బంతి పూలతో పచ్చగా మారాయనడం అతిశయోక్తి కాదు. గ్రామ గ్రామాన జనం స్వచ్ఛందంగా ఆత్మీయ స్వాగతం పలికారు.  గిట్టుబాటు ధర లేదని, రుణమాఫీ కాలేదని, ప్రాజెక్టులు పూర్తి చేయడం లేదని, నీరు ఇవ్వడం లేదని రైతులు జగన్‌ దృష్టికి  తీసుకువచ్చారు  పాదయాత్ర సందర్భంగా వైయ‌స‌ జగన్‌ ముందు అనేక మంది పలు సమస్యలను ప్రస్తావించారు.  జిల్లాలోని ప్రజలు తిరిగి రాజన్న రాజ్యం కోసం వైయ‌స్ జగన్‌ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ జిల్లా ఎన్నటికీ వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి పెట్టని కోట అని చాటిచెప్పడానికి సిద్ధమని మ‌రోమారు స్ప‌ష్ట‌మైంది.
Back to Top