<br/><br/>హైదరాబాద్: ఈ దీపావళి ప్రతి ఇంటా ఆనందాల కోటి కాంతులు నింపాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు, తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని వైయస్ జగన్ పేర్కొన్నారు.