విజయనగరంః ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పేదల బతుకుల్లో వెలుగులు నింపిన దివంగత నేత మహానేత వైయస్‌ఆర్ మరణంతో వారి బతుకుల్లో చీకటి ముసురుకుంది. జీవచ్ఛవంలా బతికిన ఎన్నో జీవితాల్లో ఆరోగ్యశ్రీ వంటి పథకం నూతన జీవం చిగురింప చేసింది.టీడీపీ ప్రభుత్వం వైయస్‌ఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ నిర్వీర్యం చేసింది. ప శ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సీతంపేటకు చెందిన నిరుపేదల దంపతులకు పెద్ద కష్టమే వచ్చింది..తమ నాలుగేళ్ల చిన్నారికి బ్రెయిన్‌లో నీరు చేరడంతో ఎదుగుదల ఆగిపోయింది..పాపకు ఆపరేషన్‌కు చేయించాలంటే సుమారు రూ. 20 లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు.నిరుపేదలైన ఆ దంపతులు వైద్యం చేయించుకునే స్థామత లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితి. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి బతికిఉంటే మాకి కష్టం వచ్చేంది కాదని ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం జరిగేందని ఆ మహానేతను తులుచుకుని ఆ దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. వైయస్‌ఆర్ ఆశయాలు పుణికిపుచ్చుకున్న ఆయన బిడ్డ వైయస్ జగన్‌ను కలిస్తే తమ బిడ్డను ఆదుకుంటారనే ఆశతో పశ్చిమగోదావరి నుంచి విజయనగరం జిల్లా వచ్చి పాదయాత్రలో ఉన్న వైయస్ జగన్‌ను కలిసి తమ బాధను చెప్పుకున్నారు. వైయస్ జగన్ ఆ పాపను తన చేతులతో హత్తుకుని చలించిపోయారు. ఆ దంపతు లకు ధైర్యం చెప్పి బిడ్డకు ఆపరేషన్‌ను చేయిస్తానని జగన్ హామీ ఇచ్చారు. వైయస్ జగన్ భరోసా ఇవ్వడంతో ఆ దంపతులు ఊరట చెందారు. ఎంతో సంతోషంగా తిరిగివెళ్ళారు. రాజన్న బిడ్డ తమకు మేలు జరుగుతుందనే కొండంత నమ్మకం ఆ దంపతుల కళ్లలో కనిపించింది.