క్రీడాకారులకు వైయస్ జగన్ ప్రశంసలు

రియో ఒలింపిక్స్ లో భారత అథ్లెట్లు దీపా కర్మాకర్, లలితా బాబర్ ప్రదర్శన దేశానికి గర్వకారణమని ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ అన్నారు. భారత్ ఉపఖండం తరపున వీరిద్దరూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని ప్రశంసించారు .అదేవిధంగా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లిన బ్యాడ్మింటన్ క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధూ లను అభినందించారు. సత్తా చాటాలని ఆయన ఆకాంక్షించారు. ఈమేరకు వైయస్ జగన్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఈసందర్భంగా వైయస్ జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ వారు  రీ ట్వీట్ చేశారు.

పురుషుల సింగిల్ ప్రీ కార్టర్ ఫైనల్లో ప్రపంచ 5వ ర్యాంకర్ జాన్ జార్గెన్ సన్ ను శ్రీకాంత్ బోల్తా కొట్టించాడు. మహిళల సింగిల్స్ విభాగంలో  ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్, చైనీస్ తైపీ క్రీడాకారిణి తాయ్ ఝు యింగ్ పై సింధు గెలిచి క్వార్టర్స్ లోకి ప్రవేశించింది. జిమ్నాస్టిక్స్ లో కేవలం 0.5 పాయింట్ల తేడాతో కాంస్యాన్ని కోల్పోయినా...దీపా కర్మాకర్ అద్భుత ప్రదర్శన కనబర్చింది. మరోవైపు, మహిళల 3000వేల మీటర్ల స్టీపుల్ చేజ్ ఫైనల్లో లలితా శివాజీ బబ్బర్ 9 నిమిషాల 22.74 సెకన్లలో రేసును పూర్తి చేసి పదో స్థానంతో సరిపెట్టుకుంది


తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top