పచ్చనేతల దాడి..రైతు ఆత్మహత్యాయత్నం

గుంటూరు:

 రాష్ట్రంలో అధికార పార్టీల నేతల అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. తాజాగా గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లిలో టీడీపీ నేతలు మరోసారి బరి తెగించారు. గ్రామంలోని చెరువులో టీడీపీ నేతలు అక్రమంగా క్వారీయింగ్కు పాల్పడ్డారు. గమనించిన స్థానిక రైతులు వారిని అడ్డుకోవడానికి యత్నించగా  పచ్చనేతలు దాడులకు దిగారు. ఈ దాడుల్లో రైతులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మనస్తాపం చెందిన శ్రీనివాసరావు అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. గమనించిన గ్రామస్తులు వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాసరావు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ నేతల తీరుపై రైతులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.

తాజా ఫోటోలు

Back to Top