చంద్రబాబుపై చీటింగ్ కేసులు పెడతాం

విశాఖపట్నంః అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఏ ఒక్క హామీ నెరవేర్చని చంద్రబాబు... నవనిర్మాణ దీక్షల పేరుతో మరోసారి ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని విశాఖ జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో జరిగిన విలేకరుల సమావేశంలో అమర్నాథ్ మాట్లాడారు. ప్రభుత్వం వంచనకు నిరసనగా బుధవారం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల లలో బాబుపై చీటింగ్ కేసులు పెట్టనున్నట్లు ప్రకటించారు.

Back to Top