ఐటి దాడులంటే అంత వణుకెందుకు బాబూ

రెండు రోజులుగా వణికిపోతున్న చంద్రబాబు

స్వార్థం కోసమే ఐటి దాడులను రాష్ట్రంపై దాడిగా చిత్రీకరణ

చంద్రబాబు తానా అంటే...ఎల్లో మీడియా తందాన

చీపురుపల్లి సభలో మండిపడ్డ జననేత


చీపురుపల్లి :  రాష్ట్రంలో గత రెండు రోజులుగా ఐటి అధికారులు జరుపుతున్న దాడులను
చూసిన చంద్రబాబు నాయుడు తన డొంక ఎక్కడ కదులుతుందో అని భయపడుతున్నారని జననేత వైయస్
జగన్ అన్నారు. చీపురుపల్లిలో నిర్వహించిన బహిరంగసభలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి
ప్రసంగించారు.  చంద్రబాబు నాయుడు రెండు రోజుల
నుంచి  శివాలెత్తిపోతున్నాడు. ఎవరింట్లోనే ఐటిదాడులు జరిగితే ఆయన
ఎందుకు భయపడుతున్నారంటే ప్రతి నియోజకవర్గంలో 30 కోట్ల రూపాయలను
ఇప్పటికే చేర్చారు. ఆ డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసేందుకు సొమ్మును దాచిపెట్టాడు. ఆ
సోమ్ము ఎక్కడ బయటకు వస్తాయోనని  చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని జగన్ అన్నారు. 23 మంది వైయస్‌ఆర్‌సీపీ
ఎమ్మెల్యేలను చంద్రబాబు ఒకొక్కరికి 30 కోట్లు ఇచ్చి  కొనుగోలు చేశాడు. ఆ వివరాలు ఎక్కడ బయటకు
వస్తాయోమోనని వణికిపోతున్నాడు. రాష్ట్రంలో ఇసుక,మట్టి, బొగ్గు, కరెంటు కొనుగోలు,మద్యం, కాంట్రాక్టులు, రాజధాని భూములు,గుడి భూములు,విశాఖ భూములు,దళిత భూములు కూడా
వదిలిపెట్టడం లేదన్నారు. నాలుగేళ్లలో నాలుగు లక్షల కోట్లు దోచేసిన సంగతి
బయటకొస్తాయోమోనని భయపడుతున్నాడన్నారు. తన అక్రమార్జనను విదేశాలకు ఎలా తరలించారని
తెలిసిపోతుందనే భయంతో చంద్రబాబు వణికిపోతున్నారన్నారు.

ఇలాంటి పరిస్థితుల మధ్యనే  ఐటిదాడులను రాష్ట్రంపై యుద్ధంగా చిత్రీకరించే
ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారన్నారు. ఎవరిపైనో ఐటిదాడులు జరిగితే చంద్రబాబు
కేబినెట్‌ మీటింగ్‌లు పెట్టి చర్చిస్తారు..ఇంత కన్నా దారుణమైన ముఖ్యమంత్రి
ఎక్కడైనా ఉంటారా అని ప్రశ్నించారు. గతంలో 2016,17లలో కూడా ఐటిదాడులు జరిగాయి, నాడు చంద్రబాబు
ఎక్కడ మాట్లాడలేదు..కాని నేడు మాత్రం రాష్ట్రానికి, కేంద్రానికి యుద్ధం
మంటూ బిల్డప్‌ ఇస్తున్నారన్నారు. ఇంతకన్నా దౌర్భగ్య పరిస్థితి ఉందా అని చంద్రబాబు
వ్యవహారశైలిని ఎండగట్టారు.

గతంలో కాంగ్రెస్‌తో కలిసి కుట్ర పన్ని తనపై  కేసులు పెట్టి దాడులు జరిపించినప్పుడు ఈ
రాష్ట్రంలో యుద్ధం జరుగుతున్నట్లు అనిపించాలేదా అని జననేత ప్రశ్నించారు.  ఓదార్పు కోసం మాట
మీద నిలబడిన వ్యక్తిని రాజకీయంగా అణగద్రోక్కడానికి చేసిన కుట్ర కేంద్రం చేసినా
అన్యాయంగా నీకు కనిపించలేదా అని నిలదీశారు.

232 గ్రామాలకు తాగునీటి అందించిన ఘనత వైయస్‌ఆర్‌దే..

 చీపురుపల్లి
నియోజకవర్గంలో నాన్నగారు వైయస్‌ఆర్‌ హయాంలో 150 కోట్లు వ్యయంతో 232 గ్రామాలకు
తాగునీటి అందించిన ఘనత వైయస్‌ఆర్‌దని ఇక్కడ ప్రజలు నా దగ్గరకు వచ్చి చెప్పితే చాలా
సంతోషమనిపించిందన్నారు. ఇదే నియోజకవర్గంలో నాన్నగారు వైయస్‌ఆర్‌ హయాంలో 38వేల గృహాలను
నిర్మించారన్నా అని ప్రజలు తెలిపారన్నారు . అదేవిధంగా డైట్‌ కాలేజిలో 16 మంది లెక్చరర్లు ఉండాల్సి ఉంది..
కాని ఒకరే మాత్రమే ఉన్నారని విద్యార్థులు చెపుకొచ్చారన్నారు.  నేడు విద్యార్థుల
పరిస్థితి ఎంతదారుణంగా ఉందో తెలుస్తుందన్నారు. ఇదే
డైట్‌ కాలేజిలో కనీసం టెస్ట్‌ బుక్‌లు కూడా ఇవ్వని అధ్వాన్న పరిస్థితుల్లో పాలన
సాగిస్తున్నారన్నారు. ఎంతటి దారుణంగా పాలన సాగుతుందో చెప్పడానికి నిదర్శనమన్నారు.
చీపురుపల్లిలో అంబులెన్స్‌లు పరిస్థితులు ఎలా ఉందంటô  నాలుగు అంబులెన్స్‌లు
ఉంటే రెండు అంబులెన్సులు మూలనపడిన పరిస్థితులు ఉన్నాయన్నారు.

ప్రత్యేక హోదా బాబు పిల్లి మొగ్గలు-ఎల్లో మీడియా పచ్చపాతం

చంద్రబాబు నాయుడు ప్రత్యేకహోదా వద్దు అంటే ఎల్లోమీడియా దానిని గొప్పగా చూపిస్తోంది. ప్రత్యేకహోదా వల్ల ఏం లాభం వచ్చిందని పచ్చమీడియా చూపెడుతుంది. ప్రత్యేకహోదా సాధిస్తానని చివరిలో చంద్రబాబు ప్లేటు మారిస్తే దానిని ఇంకా గొప్పగా చూపిస్తోంది. ప్రత్యేక హోదా సంజీవని అని ఉదయం చంద్రబాబు అంటే ఎల్లోమీడియా అవును అంటోంది. మళ్లీ మధ్యాహ్ననికి ప్రత్యేకహోదా సంజీవని కాదు ప్రత్యేకహోదాతో ఈశాన్య రాష్ట్రాలు ఏమి బాగుపడ్డాయని చంద్రబాబు అంటే ఎల్లో మీడియా ప్లేటు తప్పి అవును ప్రత్యేక హోదా సంజీవని కాదంటూ మళ్లీ రాయడం మొదలుపెడుతుందన్నారు. మళ్లీ రాత్రి చంద్రబాబు పడుకుని లేచిన తర్వాత ప్రత్యేకహోదాకు నేను వ్యతిరేకం కాదు...ప్రత్యేకహోదా కోసం పోరాటం చేస్తున్నాను అని చెప్పితే.. ఇదే ఎల్లో మీడియా ప్రత్యేకహోదా కోసం చంద్రబాబు నాయుడు రాత్రిపగళ్లు కష్టపడుతున్నారని రాస్తుందన్నారు. చంద్రబాబు నంది ని చూపించి పంది అంటే ఇదే ఎల్లోమీడియా పంది అంటోంది.ఇదే ఎలోమీడియా చంద్రబాబు పందిని చూపించి నంది అంటే..అది నంది అంటోందని విమర్శించారు. చంద్రబాబు దోచేసిన దానిని అభివృద్ధి అంటూ ఎల్లోమీడియా ప్రచారం చేస్తుందన్నారు. రెండు రోజుల క్రితం ఒక ఎన్నికల సర్వే వచ్చింది. ఎన్నికల్లో సర్వే సి–ఓటరు సర్వేలో  ఇప్పటికిప్పడు ఎన్నికలు జరిగితే 21 లోక్‌సభ స్థానాల్లో వైయస్‌ఆర్‌సీపీ గెలుస్తుందని తేలిందన్నారు.. టీడీపీకీ  నాలుగే వస్తాయని తెలిపింది. ఈనాడు దినపత్రికలో ఇదే వార్తను ఎక్కడ కూడా చంద్రబాబుకు నాలుగే స్థానాలు వస్తాయని రాయకుండా ఎడిటింగ్‌ చేస్తారు.. వైయస్‌ఆర్‌సీపీకి 21 స్థానాలు వస్తాయనే వార్త కనిపించదన్నారు.  చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చాలంటే జగన్‌కు మీ అందరి తోడు కావాలి.. మార్పు తీసుకురావడానికి సాధ్యమవుతోందన్నారు 

తాజా వీడియోలు

Back to Top