<strong>విజయనగరంః</strong> బొబ్బిలి నియోజకవర్గానికి చెందిన మంత్రి సుజయ్ కృష్ణ రంగారావుపై ప్రజలు మండి పడుతున్నారు.వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి అభివృద్ధి పేరుతో టీడీపీలోకి ఫిరాయించిన సుజయ్ కృష్ణ రంగారావు సాధించిదేమిటో చెప్పాలని స్థానికులు ప్రశ్నించారు.బొబ్బిలి నియోజకవర్గంలో అభివృద్ధి కనిపించడంలేదన్నారు. బొబ్బిలి ప్రజల్ని ఓటు అడిగే హక్కు కూడా ఆయనకు లేదన్నారు.రోడ్లు,తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదన్నారు. పార్టీ ఫిరాయింపులే కాదు..నియోజకవర్గ అభివృద్ధిని కూడా పక్కనపెట్టి స్వార్థ రాజకీయాలకు పాల్పడ్డారన్నారు.ప్రజా సమస్యలను పట్టించుకోవడంలేదని జగన్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు.