వినూత్న రీతిలో ఎమ్మెల్యే ఆర్కే నిరసన

గుంటూరు: రాజధాని గ్రామాల్లో రెండో పంట వేయడానికి వీల్లేదంటూ ప్రభుత్వం ప్రకటించడానికి నిరసనగా గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) నిడమర్రు గ్రామంలోని లైబర్రీ సెంటర్ నుంచి జోలెపట్టి, సత్తుపల్లెంలో వినూత్న రీతిలో భిక్షాటన ప్రారంభించారు. ఈ సందర్భంగా తమ భూములను కాపాడాలంటూ పలువురు వృద్ధులు, మహిళలు, రైతులు వేడుకోవడంతో పోరాటం ఉద్ధృతం చేస్తామని వారికి భరోసా ఇచ్చారు. భిక్షాటనలో వచ్చిన బియ్యం, వడ్లు వైఎస్సార్ విగ్రహానికి సమర్పించిన అనంతరం తిరిగి వాటిని పేదలకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పచ్చల రత్నకుమారి, సర్పంచ్ మండెపూడి మణెమ్మ, ఎంపీటీసీలు కొదమగొండ్ల నాగరత్నం, షేక్ హన్నన్, అన్నే శేషారావు, మెగిలి మధులతో పాటు నిడమర్రు, కురుగల్లు గ్రామాల రైతులు రైతుకూలీలు, కౌలురైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top