పూలతో జగన్‌కు అభిమానుల ఘనస్వాగతం

హైదరాబాద్, 24 సెప్టెంబర్ 2013:

చంచల్గూడ జైలు నుంచి‌ మంగళవారం సాయంత్రం విడుదలైన వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత, కడప లోక్సభ సభ్యుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డికి అభిమానులు పూలతో ఘనంగా స్వాగతం పలికారు. జైలు నుంచి బయటకు వచ్చిన శ్రీ జగన్ను చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు అభిమానులు తోచుకువచ్చారు.‌ జనం కిక్కిరిసిపోవడంతో శ్రీ జగన్‌ ఉన్న వాహనం కదలడం కూడా కష్టమైపోయింది. ఎటు చూసినా జనమే జనం. రాష్ట్రం నలుమూల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు తరలి వచ్చారు. జై జగన్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఆయనకు హార్ధిక స్వాగతం పలికారు.

485 రోజులు జైలులో ఉండి, బయటకు వచ్చిన యువనేత, జననేతను చూసేందుకు యువత ఉత్సాహంగా ముందుకు వచ్చారు. అందరికీ రెండు చేతులు జోడించి, చిరునవ్వుతో శ్రీ జగన్ అభివాదం చే‌స్తూ ముందుకు కదిలారు. జైలు నుంచి ఆయన వాహనం వెళ్లే రోడ్లన్నీ అభిమాన జనంతో కిక్కిరిసిపోయాయి.‌ శ్రీ జగన్ కాన్వాయ్‌ను అనుసరిస్తూ జనం నడుస్తున్నారు. జైలు వద్ద నుంచి లోటస్పాండ్లోని ‌శ్రీ జగన్ నివాసం‌ వరకు రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరి ఆయన రాక కోసం వేచి ఉన్నారు. జనవాహినిని తప్పించుకొని ఆయన ఇంటికి చేరుకోవడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top