‘వాక్‌ విత్‌ జగనన్న’ పోస్టర్‌ విడుదల– ప్రతి ఒక్కరూ వైయస్‌ జగన్‌ పాదయాత్రకు సంఘీభావం తెలపండి
– ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే ఉమ్మారెడ్డి, అంబటి రాంబాబు పిలుపు

హైదరాబాద్‌: ఈ నెల 29న నిర్వహిస్తున్న ‘‘వాక్‌విత్‌ జగనన్న’’ కార్యక్రమంలో పార్టీ శ్రేణులంతా పాల్గొని విజయవంతం చేయాలని వైయస్‌ఆర్‌సీపీ నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటô శ్వర్లు, అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. ఈ నెల 29వ తేదీ వెయ్యి కిలోమీటర్ల మైలు రాయి దాటనున్న వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావంగా వైయస్‌ఆర్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం, సోషల్‌మీడియా ఆధ్వర్యంలో తలపెట్టిన వాక్‌ విత్‌ జగనన్న కార్యక్రమం పోస్టర్‌ను గురువారం హైదరాబాద్‌ పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్‌నాయకులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు తదితరులు విడుదల చేశారు. ఈ కార్యక్రమం ఐదు మెట్రో సిటీలు, 25 పార్లమెంట్‌ స్థానాలు, 175 అసెంబ్లీ  నియోజకవర్గాలు, 624 మండలాలు, 25 విదేశీ నగరాల్లో వాక్‌ విత్‌ జగనన్న కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రకు ప్రతి  ఒక్కరూ సంఘీభావం తెలపాలని నాయకులు కోరారు.  కార్యక్రమంలో ఎమ్మెల్యే కోన రఘుపతి, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, డిజిటల్‌ మీడియా నాయకులు దేవేందర్‌రెడ్డి, హర్ష, చల్లా మధుసూదన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
 
 
Back to Top