విజయమ్మ రాక కోసం ముస్తాబైన నిర్మల్‌

నిర్మల్‌ (ఆదిలాబాద్‌ జిల్లా) : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ పర్యటిస్తున్న సందర్భంగా నిర్మల్‌ పట్టణం ముస్తాబైంది. దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి సతీమణి‌ శ్రీమతి విజయమ్మ సోమవారం నిర్మల్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇందు కోసం స్థానిక ఎన్‌టిఆర్ మినీ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు బహిరంగ సభ ప్రారంభం ‌అవుతుందని నిర్వాహకులు తెలిపారు.

శ్రీమతి విజయమ్మ మొదటిసారిగా ఆదిలాబాద్ జిల్లాకు వస్తున్నారు. దీనితో సభ నిర్వాహకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేశారు. సభకు హాజరయ్యే వారికి ఇబ్బంది లేకుండా వేదికపై నుంచి ప్రసంగించే విజయమ్మ, ఇతర నాయకులు స్పష్టంగా కనిపించేలా వేదికను సిద్ధం చేశారు. సభ ఏర్పాట్లను పార్టీ‌ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, జిల్లా కన్వీన‌ర్ బోడ జనార్ద‌న్, ‌కేంద్ర పాలక మండలి సభ్యులు బాజిరెడ్డి గోవర్దన్,‌ కేకే మహేందర్‌రెడ్డి, పార్టీ జిల్లా పరిశీలకుడు సాయిరెడ్డి, మాజీ ఎంపి ఇంద్రకరణ్‌రెడ్డి పర్యవేక్షించారు.

వైయస్‌ఆర్ ‌కాంగ్రెస్‌లోకి నేడు ఇంద్రకరణ్‌రెడ్డి, కోనప్ప:
మాజీ ఎంపి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిర్మల్‌ బహిరంగ సభలో విజయమ్మ సమక్షంలో వైయస్‌ఆర్ ‌సిపిలో చేరతారు. వారితో పాటు డిసిసిబి మాజీ చైర్మన్ రాంకిష‌న్‌రెడ్డి, బోథ్ మార్కె‌ట్ కమిటీ చైర్మ‌న్ తులా శ్రీనివా‌స్‌తో పాటు మాజీ జెడ్పిటిసి సభ్యులు, ఎంపిపిలు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు చేరుతున్నారు. నిర్మల్ పట్టణ‌ం అంతా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ తోరణాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లతో నిండిపోయింది. ఇంద్రకర‌ణ్‌రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చేందుకు రంగం సిద్ధమైంది.

మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డికి‌ ఇంద్రకరణ్‌రెడ్డి అత్యంత సన్నిహితునిగా ఉండేవారు. ఇంద్రకరణ్‌రెడ్డిని వైయస్‌ఆర్ ఇంద‌ర్ అని పిలిచేవారు. వై‌యస్‌ఆర్ మరణానంతరం ఆయనకు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరించే తీరుపై ప్రతీసారి బహిరంగంగా ప్రభుత్వంపై విమర్శించేవారు. వై‌యస్‌ఆర్ పథకా‌లను పేదలకు అందించగలిగే పార్టీ వైయస్‌ఆర్ ‌సిపిలోకి విజయమ్మ సమక్షంలో ఇంద్రకరణ్‌రెడ్డి సోమవారం చేరుతున్నారు.
Back to Top