మృతుల కుటుంబాలను పరామర్శించిన వై. వెంకట్రామిరెడ్డి

గుంతకల్లు టౌన్‌: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైయస్‌ఆర్‌ సీపీ నేతలకు పార్టీ సీనియర్‌ నేత, నియోజకవర్గ సమన్వయకర్త వై. వెంకట్రామిరెడ్డి నివాళులర్పించారు. బత్తలపల్లి మండలం నల్లబోయనపల్లి గ్రామం వద్ద సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భాగ్యనగర్‌కి చెందిన నాగరాజు, మస్తాన్‌ఖాన్‌ల భౌతికకాయాలను వై.వెంకటరామిరెడ్డి సందర్శించి అంజలి ఘటించారు. మృతుల కుటుంబ కుటుంబసభ్యులను ఓదార్చారు. కుటుంబసభ్యులకు  వైయస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

తాజా ఫోటోలు

Back to Top