కుట్రలు పన్నితే చూస్తూ ఊరుకోం: వంగవీటి రాధాకృష్ణ

ఎన్నికల ముందు చంద్రబాబు ఎన్నో కబుర్లు చెప్పాడు. గుండెల మీద చేయివేసి నాదీ బాధ్యత అన్నాడు. రైతు రుణమాఫీ చేస్తా, డ్వాక్రా రుణమాఫీ చేస్తా, బంగారం రుణమాఫీ చేస్తా, నిరుద్యోగులందరికీ ఉద్యోగం ఇప్పిస్తా లేని పక్షంలో నెలకు రు.2వేలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. నిరుపేదలందరికీ ఇళ్లు కట్టిస్తానన్నాడు. ఏడాది గడిచిపోయింది. హామీలన్నీ తుంగలో తొక్కాడు. ఎమ్మెల్సీ ఎన్నికలలో కోట్లు ముడుపులు ఇవ్వజూపాడు. జగన్మోహన్రెడ్డి రాజధానికి వ్యతిరేకం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మేం రాజధానికి వ్యతిరేకం కాదు. బలవంతంగా రైతులనుంచి భూములు లాక్కోవడాన్నే మేం వ్యతిరేకిస్తున్నాం. వేల ఎకరాలు రైతుల నుంచి లాక్కున్నారు. పైగా వాళ్లే సంతోషంగా ఇచ్చేశారని అబద్దాలు చెబుతున్నారు. మీరెన్ని అబద్దాలు వల్లె వేసినా నిజమేమిటో ప్రజలకు తెలుసు. ఒక బాధ్యత గలిగిన ప్రతిపక్ష నేత ప్రజల కోసం సమర దీక్ష చేస్తుంటే కనీసం పోలీసు భద్రత కల్పించాలన్న ఇంగిత జ్ఞానం కూడా ఈ ప్రభుత్వానికి లేకపోయింది. భద్రత కోసం కూడా మేం కొట్లాడాల్సి వచ్చింది. మా నాన్నను కూడా ఇలా దీక్ష చేస్తుంటేనే కనీస భద్రత కల్పించకుండా పొట్టనపెట్టుకున్నారు. అలాంటి కుట్రలు పన్నితే మేం చూస్తూ ఊరుకోం. మా నాయకుడిని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. మా నాయకుడు జగన్మోహన్రెడ్డిని లక్ష్యంగా చేసుకుని దేవినేని ఉమ తదితర మంత్రులు అవాకులు చెవాకులు పేలుతున్నారు. అనునిత్యం ప్రజల కోసం పోరాడున్న జగన్మోహన్రెడ్డి గురించి మాట్లాడే నైతిక అర్హత మీ కెవరికీ లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. వైఎస్ఆర్ ఆశయాలు సాధించాలంటూ పార్టీ పెట్టిన నాడు ఏ లక్ష్యమైతే పెట్టుకున్నారో ఆ లక్ష్యం చేరుకునే ఆ లక్ష్యం చేరుకునే వరకు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విశ్రమించరు. ఆ ఆశయ సాధన కోసం మే మంతా కలసి కట్టుగా మా నాయకుడుకి తోడుగా నడుస్తామని, అందరం కలసి ఆశయాన్ని సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.
Back to Top