వైయస్ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి: రాజేష్

కర్నూలు:

వైయస్ఆర్ స్ఫూర్తితోనే తాను రాజకీయాలలోకి వచ్చినట్లు పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్ చెప్పారు. కర్నూలులో సాగుతున్న మరో ప్రజాప్రస్థానం షర్మిల పాదయాత్రలో ఆయన గురువారం పాల్గొన్నారు. తనలాంటి ఎందరో యువకులకు వైయస్ఆర్ స్ఫూర్తి అన్నారు. వైయస్ మరణానంతరం రాష్ట్రంలో పాలన స్థంభించిందన్నారు. వైయస్ఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు ప్రజలలోకి చొచ్చుకెళ్ళాయని పేర్కొన్నారు. ఎంతో మంది ప్రజలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని రాజేష్ తెలిపారు. కనీసం వంద మంది ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

Back to Top