<strong>కుప్పం (చిత్తూరు జిల్లా) :</strong> తెలుగుదేశం పార్టీకి చెందిన కుప్పం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్ చంద్రశేఖర్ తన కుటుంబ సభ్యులతో సహా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కుప్పంలో శనివారం జరిగిన కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుబ్రమణ్యంరెడ్డి వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.<br/>చంద్రశేఖర్ కుటుంబం చేరికతో మల్లానూరు, కొటాలూరు, వానగుట్టపల్లి పంచాయతీల్లో వైయస్‌ఆర్‌సిపి మంచి బలం వచ్చిందని సుబ్రమణ్యంరెడ్డి అన్నారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ, టిడిసి ఏర్పాటైనప్పటి నుంచీ పార్టీలో కొనసాగామన్నారు. స్థానికంగా వెనకబడిన తమ వాల్మీకి కులాన్ని కేవలం ఓటు బ్యాంకుగానే టిడిపి నాయకులు చూస్తున్నారని విమర్శించారు. మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో కులం, మతం, పార్టీలకు అతీతంగా అందరికీ అభివృద్ధి ఫలాలు అందాయని చెప్పారు. అదే తరహాలో అన్ని వర్గాల వారికీ మేలు జరిగే పాలన శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డితోనే సాధ్యమని అన్నారు.<br/>చంద్రశేఖర్‌తో పాటు ఆయన సతీమణి, పిఎసిఎస్ మాజీ డెరైక్టర్ యశోదమ్మ, చంద్రశేఖర్ తమ్ముడు లక్ష్మీనారాయణస్వామి ఆలయ కమిటీ చైర్మన్ నరసింహరాజులు నాయుడు, ఆయన కుమారుడు, మల్లానూరు తెలుగు యువత నాయకుడు లక్ష్మీనారాయణ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.