వైయస్‌ఆర్‌సిపిలో చేరిన రిటైర్డు ఐఎఎస్‌ ప్రసాదరావు

హైదరాబాద్‌, 10 డిసెంబర్‌ 2012:‌ స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన ఐఎఎస్ అధికారి వెలగపల్లి వరప్రసాదరావు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం తీసుకున్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని తన నివాసంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో వరప్రసాదరావుకు శ్రీమతి విజయమ్మ పార్టీ కండువా కప్పి చేర్చుకున్నారు.

2009 ఎన్నికల్లో వరప్రసాదరావు తిరుపతి నుంచి పిఆర్‌పి ఎంపి అభ్యర్ధిగా పోటీచేశారు. దాదాపు 27 ఏళ్ళ పాటు తమిళనాడులో వివిధ హోదాల్లో పనిచేసిన వరప్రసాదరావు స్వచ్ఛందంగా పదవీ విరమణ తీసుకున్నారు. కృష్ణా జిల్లాలోని గుడివాడ వరప్రసాదరావు స్వస్ధలం. చిత్తూరు జిల్లాతో ఆయనకు అత్యధికంగా అనుబంధం ఉంది. వరప్రసాదరావుతో పాటు పలువురు ఆయన సన్నిహితులు కూడా విజయమ్మను కలిశారు.
Back to Top