వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

గుంతకల్లు:

‘మరో ప్రజా ప్రస్థానం’ పేరుతో మహానేత డాక్టర్ వైయస్ఆర్ కుమార్తె షర్మిల నిర్వహిస్తున్న పాదయాత్ర సందర్భంగా వందలాది మంది టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ పరిణామం ఆయా పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. బుధవారంనాడు గుంతకల్లు  పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన 1500 మంది కార్యకర్తలు షర్మిల సమక్షంలో పార్టీలో చేరారు. పట్టణంలోని వివిధ వార్డుల్లో ఏర్పాటైన కార్యక్రమాల్లో వైయస్‌ఆర్ కాంగ్రెస్ గుంతకల్లు నియోజకవర్గ ఇన్‌చార్జి వై.వెంకటరామిరెడ్డి ఆయా ప్రాంతల్లోని టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను షర్మిలకు పరిచయం చేసి పార్టీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్లు కథల మారెప్ప, రాజశేఖర్‌ల ఆధ్వర్యంలో 500 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, టీడీపీకి చెందిన మాజీ కౌన్సిలర్ బాలం ఓబుళేసు ఆధ్వర్యంలో 400 మంది టీడీపీ కార్యకర్తలు, సత్యనారాయణ పేటకు చెందిన కనకరాజు, సుధ, అంజలీ నగర్‌కు చెందిన బాలరాజుల ఆధ్వర్యంలో మరో 600 మంది వైఎస్‌ఆర్ సీపీలో చేరారు. పీఆర్పీ ముఖ్యనాయకుడుగా ఉండి ప్రస్తుతం స్థబ్దుగా ఉన్న ముష్టూరు తిమ్మప్ప కూడా పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.

Back to Top