యూటర్న్‌ అంకుల్‌కు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం

అధికార దాహంతో అన్ని వ్యవస్థలను నాశనం చేశారు
జన్మభూమి కమిటీలు పెట్టి ప్రజలు పీడిస్తున్న చంద్రబాబు
రాబోయే ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ సమర్థత ఏంటో తెలుస్తుంది
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌

కాకినాడ: ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేసిందని ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ అన్నారు. కాకినాడ వంచనపై గర్జన సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ దీక్షలు చేశారని గుర్తు చేశారు. వైయస్‌ఆర్‌ సీపీ పోరాటాలతో చంద్రబాబు యూటర్న్‌ తీసుకొని ఇప్పుడు హోదా కావాలంటూ రాజకీయ డ్రామాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు అవినీతి పాలనలతో ఐదుకోట్ల ఆంధ్రరాష్ట్ర ప్రజల మోసపోయారన్నారు. హోదానే సంజీవని అని ఏకైక నినాదంతో, హోదా ఎజెండాగా ఎన్నికలకు వెళ్తామని వైయస్‌ఆర్‌ సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ చెప్పారన్నారు. యువభేరీలకు విద్యార్థులను పంపిస్తే జైలుకు పంపిస్తామని హెచ్చరించిన చంద్రబాబు.. ఇప్పుడు యూటర్న్‌ తీసుకొని యూటర్న్‌ అంకుల్‌గా పేరు పొందారన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రమాణస్వీకారం రోజున పెట్టిన సంతకాలను పరిపూర్ణంగా నెరవేర్చి ఆదర్శంగా నిలిచారన్నారు. కానీ చంద్రబాబు అధికార దాహం కోసం అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నాడని మండిపడ్డారు. 

జన్మభూమి కమిటీలు పెట్టి నాలుగున్నరేళ్లుగా ప్రజలను వేధిస్తున్నాడని ఎమ్మెల్యే సురేష్‌ మండిపడ్డారు. రాష్ట్రాన్ని విభజన చేసిన కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయాలని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నాడన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. ఓటుకు నోటు కేసు కోసం చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిశారన్నారు. రూ. 400 కోట్లు, నాలుగు హెలికాప్టర్లు ఇచ్చి అక్కడ కాలు పెట్టాలనే దురుద్దేశంతో అనైతిక పొత్తు పెట్టుకున్నారన్నారు. ఇంతకంటే దారుణమైన రాజకీయాలు చరిత్రలో ఎవరూ చేయరు. బాబు వస్తే జాబు, నిరుద్యోగ భృతి అన్నారు.. కానీ బాబు వస్తే కరువు వచ్చింది. బాబు వస్తే చేతికి చిప్ప వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్లు బీజేపీతో అంటకాగి ఏం సాధించారని చంద్రబాబును ప్రశ్నించారు. ప్రజలంతా చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలని ఎదురుచూస్తున్నారన్నారు.

వైయస్‌ జగన్‌ దైర్యం గురించి మాట్లాడే పవన్‌ నాలుగు సంవత్సరాలు వెనక్కు వెళ్లి వైయస్‌ఆర్‌ సీపీ పోరాటాల గురించి తెలుసుకోవాలన్నారు. సోనియాగాంధీనే ఎదిరించిన నాయకుడు వైయస్‌ జగన్‌ అన్నారు. జనసేన అనే పార్టీ పెట్టి స్వలాభం కోసం తెలుగుదేశం పార్టీకి అమ్ముకోవడం కాదు సమర్థత అంటే.. ఒంటరిగా పార్టీ పెట్టి 67 మంది ఎమ్మెల్యేలను, 8 మంది ఎమ్మెల్యేలను చట్టసభల్లోకి తీసుకెళ్లిన నాయకుడు వైయస్‌ జగన్‌ అని పవన్‌ తెలుసుకోవాలన్నారు. రాబోయే ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ సమర్థత తెలుస్తుందని చెప్పారు. 
Back to Top