శ్రీకాకుళంః రాష్ట్రంలో పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పుడు కిడ్నీ రోగాలు ఎందుకు వస్తున్నాయని రీసెర్చ్ సెంటర్‌లు పెట్టేందుకు ప్రభుత్వం ఆలోచించాలి. ప్రజలకు ఎందుకు రోగాలు వస్తున్నాయని ఆలోచన చేసి రాకుండా ఏం చేయాలో జాగ్రత్తలు తీసుకోవాలి. మామూలుగా రిసెర్చ్ సెంటర్‌లు పెట్టి పేదలకు తోడుగా నిలబడాల్సిందిన ముఖ్యమంత్రి ఆ పని చేయడు. మూడు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటి వరకు ఒక్కచోటైనా రిసెర్చ్ సెంటర్ పెట్టాలనే మంచి ఆలోచన చంద్రబాబు చేయలేదు. కేంద్ర ప్రభుత్వమైనా రిసెర్చ్ సెంటర్ పెడుతుందేమో...? దానితోనైనా పెట్టించాలనే ఆలోచన బాబుకు రాలేదు. కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ ద్వారా కొలబరేట్ అయ్యి రిసెర్చ్ సెంటర్ పెడితే కొలిక్కివస్తుంది. కడప ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి పార్లమెంట్‌లో ఒక ప్రశ్న అడిగాడు. 7 ఏప్రిల్ 2017 క్వశ్చన్ నెంబర్ 5610లో... ఇందులో అడిగిన క్వశ్చన్ ఇక్కడి ప్రజలకు సంబంధించింది. రాష్ట్ర ప్రభుత్వం రీసెర్చ్ సెంటర్ పెట్టాలని కేంద్రాన్ని అడిగిందా అని ప్రశ్న వేస్తే... ఎలాంటి రిక్వెస్ట్‌రాలేదు అని కేంద్రం రాతపూర్వకంగా లేఖ ఇచ్చింది.
ప్రజలను ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి. ఇలా ఎందుకు జరుగుతుందో అని రిసెర్చ్ సెంటర్‌ల ద్వారానే అధ్యాయనం చేయాలి. నీళ్లలో రియాక్టీవ్ ఎలిమెంట్స్ ఎక్కవుగా ఉన్నాయి. సిలికా దగ్గర నుంచి స్ట్రాన్షమ్ వరకు, స్ట్రాన్షమ్ దగ్గర నుంచి క్యాడ్మియం ఆర్సినిక్ ఇటువంటివన్నీ కనిపిస్తున్నాయి. పొలాల్లోకి వాడాల్సిన నీటినే తాగడానికి ఉపయోగిస్తున్నాం... మనం తినే బియ్యంలో కూడా ఇవే రికాయక్టీవ్ మెటల్స్ కనిపిస్తున్నాయి. అటువంటి వాటిని మనం తింటున్నాం.. అని అర్థం అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో మంచి నీళ్లు ఇచ్చే కార్యక్రమం జరగాలి. తాగడానికి నీళ్లు బాగలేని పరిస్థితుల్లో సర్ఫేస్ వాటర్ తీసుకురావాలి. వంశధార, నాగవలి, బాహుదా, మహేంద్రతనయా దగ్గర నుంచి ఆ నీళ్లను కెనాల్స్ ద్వారా తీసుకొచ్చి సర్ఫేస్ వాటర్ క్వాలిటీని మార్చాలి. ప్రకాశం జిల్లాలో కూడా వెలుగొండ ప్రాజెక్టు పూర్తయి కృష్ణా నది నీళ్లు ప్రకాశానికి ఎప్పుడు వస్తాయో అప్పుడే క్వాలిటీ మారుతుంది. ఇదేనా పరిష్కారం.. ఇవికాక ఇంకా వేరే మార్గాలు ఉన్నాయా అని ఆలోచన చేసి రిసెర్చ్ చేయాలి. అవేమీ చంద్రబాబుకు పట్టడం లేదని వైయస్ జగన్ ఫైర్ అయ్యారు.