తెలుగు దేశం పాలనలో మహిళలకు క‌న్నీళ్లే

భాకరాపేట : రాష్ట్రంలో తెలుగు దేశం పాలనలో మహిళలకు రోజూ కన్నీళ్లే అని చిన్నగొట్టిగల్లు మండల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కె మహేంద్రరెడ్డి అన్నారు. సోమవారం చిన్నగొట్టిగల్లులో స్థానిక విలేకరులతో  మాట్లాడుతూ తెలుగు దేశం పాలనలో మహిళలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు.  జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న రాష్ట్రంలో మహిళలపై జరుగతున్న అరాచకాలు, ఎమ్మెల్యే రోజాను మహిళా పార్లమెంటు సభకు హాజరు కాకుండా అడ్డుకుని అరెస్టు చేయడం దారుణం అన్నారు. తెలుగుదేశం పార్టీ అరాచాలకు పరాకాష్ఠగా అబివర్ణించారు. ప్రజా సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వం ప్రశ్నించేవారు కనబడితే వారిపై దాడులు చేయడం పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు. తెలుగు దేశం పాలనలో మహిళలు కన్నీళ్లు కార్చని రోజు లేదన్నారు.

Back to Top