టీడీపీ ధర్నాకు స్సందన కరవు

విజయవాడ, 25 ఆగస్టు 2012 : తెలుగుదేశం, సీపీఐ పార్టీలు శనివారం ఇక్కడి ప్రకాశం బ్యారేజ్­ వద్ద నిర్వహించిన మహా ధర్నాకు రైతుల నుంచి స్పందన కరవైంది. కృష్ణా డెల్టాలోని 13 లక్షల ఎకరాలకు సాగునీటిని విడుదల చేయడకుండా తాత్సారం చేస్తున్న ప్రభుత్వం వైఖరికి నిరసగా టీడీపీ, సీపీఐ పార్టీలు ఈ మహా ధర్నాకు పిలుపునిచ్చాయి. చంద్రబాబు నాయుడు తెచ్చిపెట్టుకున్న ప్రేమను తమ పట్ల ఒలకబోస్తున్నారని రైతులు భావిస్తున్న కారణంగానే ఈ మహా ధర్నాకు స్పందన కరవైందని అర్థమవుతోంది.  ఇదే ప్రకాశం బ్యారేజ్­ వద్ద చంద్రబాబు నాయుడు 2010లో నిర్వహించిన ప్రదర్శనకు కూడా రైతుల నుంచి సరైన స్పందన రాని విషయం గమనార్హం.

Back to Top