వైయ‌స్ఆర్‌ సీపీలో భారీ చేరికలు


విశాఖ‌:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు వివిధ ప్రాంతాల నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఆక‌ర్శితుల‌వుతున్నారు. విశాఖ జిల్లాలో భారీ ఎత్తున టీడీపీ నాయ‌కులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.  పరవాడ మండలం సాలాపువానిపాలెంలో టీడీపీకి చెందిన 50 కుటుంబాల వారు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. వైయ‌స్ఆర్‌సీపీ గ్రామ అధ్యక్షుడు సాలాపు నానాజీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నాయకుడు, జన్మభూమికమిటీ సభ్యుడు సాలాపు అప్పారావు, మాజీ ఉప సర్పంచ్‌ సాలాపు కనకరాజు, వార్డు సభ్యుడు సాలాపు నూకరాజు, లారీ ఓనర్లు సాలాపు శ్రీనివాసరావు, నానాజీ, రామకృష్ణ, అప్పలనాయుడు, బాబూరావుతో పాటు 50 కుటుంబాలకు చెందిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బక్కన్నపాలెం మాజీ ఉపసర్పంచ్‌ ఆర్‌. స్వామినాయుడు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు తైనాల విజయకుమార్‌  పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయా కార్య‌క్ర‌మాల‌లో  అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌, అనకాపల్లి పార్లమెంట్‌ నియోకవర్గ ఇన్‌చార్జ్‌ వరుదు కల్యాణి, పెందుర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్‌ అన్నంరెడ్డి అదీప్‌రాజు, పార్టీ జిల్లా కార్యదర్శి ఇల్లపు ప్రసాద్, పెందుర్తి నియోజకవర్గం నాయకులు పైలా శ్రీనివాసరావు, 56వ వార్డు పార్టీ అధ్యక్షుడు జి.పూర్ణానందశర్మ (పూర్ణ), పరవాడ మండల అధ్యక్షుడు  సిరపురపు అప్పలనాయుడు, పరవాడ సర్పంచ్‌ చుర్కా రామునాయుడు, నాయకులు  సుందరపు అప్పారావు, పచ్చికోరు రమణమూర్తి, సేనాపతి గంగరాజు   త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

తాజా ఫోటోలు

Back to Top