టీడీపీకి ఎన్నికల కోడ్‌ వర్తించదా...?

వైయస్‌ఆర్‌ జిల్లా(మైదుకూరు) : ఎన్నికల కోడ్‌ప్రతి పక్ష పార్టీ వారికే చెందుతుందా..?   అధికార  పార్టీకి వర్చించదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మైదుకూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయం వద్ద ఉంచిన అధికార పార్టీ నాయకుల ప్లెక్సీలు, ముసలనాయనపల్లె వద్ద ఏర్పాటు చేసిన ప్లెక్సీలను తొలగించడంలో అధికారులు సాహసం చేయలేకపోతున్నారు.  మున్సిపాలిటీ, మండలంలోని వనిపెంట, జీ.వీ సత్రంలో ఉన్న ప్లెక్సీలు ఫిబ్రవరి మొదటి వారంలో ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎన్నికల కోడ్‌ వెలవడిన నుంచే తొలగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. కాని టీడీపీ కార్యాలయం వద్ద అధికార పార్టీ నాయకుడికి స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసి ప్లెక్సీలకు మాత్రం ఎన్నికల కోడ్‌ అమల్లో లేకుండా పోయింది. అధికారులు ఎన్నికల కోడ్‌ అంటే అన్ని పార్టీలకు వర్తించే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రజలు పేర్కొంటున్నారు. 

తాజా ఫోటోలు

Back to Top