విజయవాడ : టీడీపీకి చెందిన 'కాల్మనీ' కీలక సూత్రధారి శ్రీరామమూర్తి ముఠా సాగించిన దాష్టీకం నగరంలో మరోకటి వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లా కాకులపాడుకు చెందిన 70 ఏళ్ల ఎలమంచిలి వెంకటేశ్వరరావు అనే వృద్ధుడిపై బౌన్సర్లు దాడి చేశారు. దీంతో, బాధితుడు వెంకటేశ్వరరావు నగర సీపీ గౌతం సవాంగ్ ను కలిసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. <br/>నగదు అప్పు తీసుకున్న వెంకటేశ్వరరావు కుటుంబాన్ని శ్రీరామమూర్తి గ్యాంగ్ గతంలో తీవ్ర వేధింపులకు గురిచేసింది. వారి హింసను తట్టుకోలేక 16 నెలల క్రితమే వెంకటేశ్వరరావు భార్య, కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీరామమూర్తి ఆగడాలపై గతంలో జిల్లా ఎస్పీకి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. శ్రీరామమూర్తికి అధికార పార్టీ నేతల అండ ఉన్న కారణంగా సదరు ఫిర్యాదును పట్టించుకోలేదు.