<br/><br/>శ్రీకాకుళం: ఎన్నికల సమయంలో వచ్చి ఆమదాలవలస కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని చెప్పిన చంద్రబాబు నాలుగున్నరేళ్లయినా ఫ్యాక్టరీ వైపు కన్నెత్తి కూడా చూడలేదని రైతులు వాపోయారు. శ్రీకాకుళంలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నారాయణపురం ఆనకట్ట సమీపంలోని రైతులు కలిశారు. వారి సమస్యలపై జననేతకు వినతిపత్రం అందజేశారు. షుగర్ ఫ్యాక్టరీ మూతపడి పదేళ్లు అవుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఫ్యాక్టరీ తెరిపిస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు మోసం చేశాడన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను అడిగితే నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారన్నారు. అదే విధంగా నారాయణపురం ఆనకట్ట ప్రధాన సాగునీటి వనరు అని దాన్ని పట్టించుకునే వారు ఎవరూ లేరన్నారు. అడిగితే.. ఇప్పుడు.. అప్పుడూ అంటూ మాయమాటలు చెబుతూ కాలం వెల్లదీస్తున్నారన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.