నెల్లూరు(కావలి): ప్రమాదకరంగా విద్యుత్ వైర్లు వేలాడుతున్నా సంబంధిత అధికారులు వాటిని సరిచేయకపోవడం దారుణమని వైయస్సార్‌సీపీ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి పత్రాప్ కుమార్‌రెడ్డి మండిపడ్డారు. మండల పరిధిలోని చలంచర్ల గ్రామంలో ఆయన ఆకస్మిక పర్యటన చేశారు. గ్రామంలో నెలకొన్న పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా చేతులకు తాకేట్టు కిందకు వేలాడుతున్నాయని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ప్రతాప్ కుమార్ రెడ్డి వెంటనే విద్యుత్ అధికారులతో చరవాణిలో సంభాషించారు. వాటిని సరి చేయాలని విద్యుత్ ఏఈకి సూచించారు.